వంద శాతం ఆక్యుపెన్సీ అడుగుతున్న రాజమౌళి

నిన్ననే తెలంగాణ థియేటర్స్ యాజమాన్యాల అసోసియేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 నుంచి సినిమా హాళ్లు తెరవడానికి సమ్మతించింది. 50శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడానికి ముందుకొచ్చింది. దీనిపై రాజమౌళి స్పందించాడు. 50శాతం ఆక్యుపెన్సీతో…

నిన్ననే తెలంగాణ థియేటర్స్ యాజమాన్యాల అసోసియేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 నుంచి సినిమా హాళ్లు తెరవడానికి సమ్మతించింది. 50శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడానికి ముందుకొచ్చింది. దీనిపై రాజమౌళి స్పందించాడు. 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాను ప్రదర్శించే కంటే.. వంద శాతం ఆక్యుపెన్సీకి ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే థియేటర్లు తెరవడం బెటర్ అంటున్నాడు రాజమౌళి.

“సినిమా ఎక్స్ పీరియన్స్ విషయంలో మిగతా ప్రపంచాన్ని ఇండియాను పోల్చి చూడలేం. మనకు థియేటర్లలో సినిమా చూడడం అనేది బేసిక్ ఎంటర్ టైన్ మెంట్. మిగతాచోట్ల ఇలా లేదు కాబట్టి మనపై కూడా అలాంటి ప్రతికూల ప్రభావమే ఉంటుందని చెప్పలేం. 

జనాలు ఎదురుచూసే సినిమాలు వస్తే కచ్చితంగా ప్రేక్షకులు ముందుకొస్తారు. కాకపోతే 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. నన్ను అడిగితే వంద శాతం ఆక్యుపెన్సీతో ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే, అప్పుడే థియేటర్లు తెరవడం బెటర్.”

ఇలా తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పాడు రాజమౌళి. ఇక 20శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకునే అంశంపై కూడా రియాక్ట్ అయ్యాడు. పారితోషికాలు తగ్గించుకోవడానికి నటీనటులతో పాటు సిబ్బంది అంతా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని.. కాకపోతే సినిమా-సినిమాకు ఆ లెక్కలు మారిపోతాయని అంటున్నాడు.

“పారితోషికం విషయంలో అందరికీ ఒకే రూలు సరికాదు. ఓ ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే ఏం చేయాలనుకుంటే ఆ సినిమాకు సంబంధించి అంతా అలా చేస్తారు. ఇదేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. సినిమా ముందుకెళ్లాలనే అంతా కోరుకుంటారు. ఇప్పుడేదో కరోనా వచ్చిందని పారితోషికాలపై చర్చ అనవసరం. రెమ్యూనరేషన్ పై డిస్కషన్లు ఎప్పుడూ ఉంటాయి.  సినిమా-సినిమాకు అవి మారుతుంటాయి.”

మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని స్పష్టంచేసిన రాజమౌళి.. హైదరాబాద్ లోనే షెడ్యూల్ ఉంటుందని తెలిపాడు. ముందుగా తారక్ పైనే షూటింగ్ ఉంటుందని, సెట్స్ పైకి వెళ్లిన వెంటనే టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని అంటున్నాడు.

హ‌రిబాబుకు అంతేనా