హీరోలు ఎప్పుడూ హీరోలే. మరీ దారుణంగా కెరీర్ గ్రాఫ్ పడిపోతే తప్పించి, వాళ్ల రెమ్యూనిరేషన్లు తగ్గవు. బాలయ్య, రవితేజ దగ్గర నుంచి లేటెస్ట్ జనరేషన్ వరకు ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు.
నిర్మాతల గిల్డ్ తీర్మానాలు, సమావేశాలు, ఆదేశాలు ఇవన్నీ హీరోలు, హీరోయిన్లకు వర్తించవు. వారిదంతా డిమాండ్ సప్లయ్ వ్యవహారమే. మిగిలిన నటీనటులు అందరి దగ్గర కోతలు వుంటాయి. టెక్నికల్ టీమ్ దగ్గర అవకాశం వుంటుంది. కానీ హీరోల దగ్గర మాత్రం కాదు.
కరోనా నేపథ్యంలో హీరోల రెమ్యూనిరేషన్ తగ్గుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఏమాత్రం తగ్గలేదు. కరోనా తరువాత ఒకె చేసిన సినిమాలకు కూడా కరోనా ముందు ఎలా తీసుకున్నారో అలాగే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ గా హీరో నాని నిర్మాత వెంకట్ బోయినపల్లికి ఓ సినిమా ఒకె చేసారు. వాస్తవానికి ఆ సినిమా నిర్మాత మారారు కానీ పాత ప్రాజెక్ట్ నే. బహుశా అందుకే కావచ్చు. రెమ్యూనిరేషన్ లో ఏం మార్పు లేదని, తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ కే ఆ ప్రాజెక్టు ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఇటీవల నాని సినిమాల పెద్దగా ఫేర్ చేసింది లేదు. జెర్సీ సినిమాకు కూడా ఒకటి రెండు ఏరియాలు నష్టం వచ్చిందని, బయ్యర్లకు అమౌంట్ రిటర్న్ ఇచ్చారని వార్తలు వున్నాయి. అయినా కూడా నాని డిమాండ్ తగ్గలేదు.రెమ్యూనిరేషన్ తగ్గలేదు.