నాని-అవసరాల సినిమా ఇప్పుడే కాదా?

అవసరాల శ్రీనివాస్ తన తరువాతి సినిమా నాని హీరోగా చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆ ప్రయత్నాలు జరిగాయి కూడా. కానీ నాని ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. మరో ఏడాది…

అవసరాల శ్రీనివాస్ తన తరువాతి సినిమా నాని హీరోగా చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆ ప్రయత్నాలు జరిగాయి కూడా. కానీ నాని ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. మరో ఏడాది పైగా వెయిట్ చేస్తే తప్ప నాని డేట్ లు దొరికేలా లేవు. అంటే అవసరాల శ్రీనివాస్ తన తరువాతి సినిమా నానితోనే చేయాలి అనుకుంటే కనీసం ఏడాది పైగానే వేచి వుండక తప్పదు. 

అందుకే తరువాత సినిమా వేరే హీరోతో చేసి, ఆ తరువాత నానితో చేయాలని అవసరాల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అవసరాల-నాని కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరు.కానీ ఏం చేయాలి..డేట్ లు లేనపుడు. అందువల్ల మరే హీరో అయితే బాగుంటుందా అని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ పేరు కీలకంగా పరిశీలనలో వున్నట్లు వినికిడి.