Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వారెవ్వా..పూరి రిపేర్లు చేయడమా?

రాత్రి ఐడియా వస్తే, తెల్లారేసరికి స్క్రిప్ట్ తయారుచేసి, మర్నాటికి సెట్ మీదకు వెళ్లి, వీలయినంత త్వరలో సినిమా తీసి థియేటర్లో వదిలే రకం పూరి జగన్నాధ్ అంటే. అనుకున్నది తీసేయడమే తప్ప, తీసింది తిరిగి చూడ్డం, తీసిందాంట్లోంచి తీసివేతలు, కూడికలు చేయడం లాంటివి అంతగా ఆయన వంటికి సరిపడవని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. 

కానీ అలాంటిది గత కొన్ని రోజులుగా తన ఇజమ్ సినిమాకు రీషూట్ ల మీద రీ షూట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజమ్ సినిమా పూరికి అవుట్ అవుట్ లైఫ్ అండ్ డెత్ కశ్చను. ఇది హిట్ అయితేనే తరువాత మళ్లీ సినిమాలు అన్న సంగతి. రోగ్ సినిమా అలా వుండిపోయింది. ఇది హిట్ కొడితే ఎన్టీఆర్ టక్కున చాన్స్ ఇచ్చేయచ్చు. 

మరెవరైనా పిలవ వచ్చు. ఇది కూడా తేడా వచ్చిందో..ఇక కష్టమే. నిష్టూరమైనా ఇది వాస్తవం. అందుకే పూరి ఇజమ్ సినిమాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసి, రీ షూట్ లు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?