Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ దర్శకుడ్ని ఇంకా వదలని నాని

ఆ దర్శకుడ్ని ఇంకా వదలని నాని

ఇద్దరూ కలిసి ఏ సినిమా చేస్తున్నారో కానీ, ఏళ్ల తరబడి చర్చలు మాత్రం సాగిస్తూనే ఉన్నారు. వాళ్లే నాని, హను రాఘవపూడి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఇప్పటిది కాదు. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా టైమ్ లోనే వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు మొదలయ్యాయి. అప్పట్నుంచిన తన ప్రతి సినిమాకు హనుతో సినిమా ఉంటుందని చెబుతున్నాడు నాని.

"ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో "V" సినిమా చేస్తున్నాను. తర్వాత చాలా సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. 2-3 సినిమాలతో పాటు హను రాఘవపూడి సినిమా కూడా ఉంది. హను రాఘవపూడి సినిమా గురించి ఇప్పుడే మాట్లాడ్డం చాలా తొందరపాటు అవుతుంది."

నాని వెర్షన్ చూస్తుంటే V సినిమా తర్వాత కూడా హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చేలా లేడు. రీసెంట్ గా జెర్సీ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు నాని. ఏకథాటిగా 100 రోజులు క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. హను రాఘవపూడి సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడాలి. మిలట్రీ ఆఫీసర్ పాత్ర అది. అందుకే ఆ ప్రాజెక్టును మెల్లమెల్లగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు.

ఇవన్నీ పక్కనపెడితే అసలు హను రాఘవపూడికి నాని ఛాన్స్ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది. 2-3 ప్రాజెక్టులు చర్చలో దశలో ఉన్నాయని చెబుతున్న నాని, హను రాఘవపూడితో సినిమా ఉంటుందని మాత్రం స్పష్టం చేయడం లేదు. మరోవైపు తన అప్ కమింగ్ మూవీ గ్యాంగ్ లీడర్ పై వస్తున్న పుకార్లను ఖండించాడు నాని. అది రీమేక్ కాదని స్పష్టంచేశాడు.

"ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు. చాలామంది ఇదేదో కొరియన్ సినిమాకు రీమేక్ అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. విక్రమ్ కుమార్ కథ ఇది. నేను, విక్రమ్ డిస్కస్ చేసి రాసుకున్న సన్నివేశాలివి. టైటిల్ కూడా విక్రమ్ కుమారే పెట్టాడు. జెర్సీ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లోనే టైటిల్ చెప్పాడు."

గ్యాంగ్ లీడర్ సినిమా తనకు ఎంత పేరు తీసుకొస్తుందో, ఇందులో విలన్ గా నటించిన కార్తికేయకు కూడా అంతే పేరు తీసుకొస్తుందంటున్నాడు నాని. ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్న కార్తికేయకు థ్యాంక్స్ చెప్పాడు. 

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?