Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నందినీరెడ్డితో వైజయంతి

నందినీరెడ్డితో వైజయంతి

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంస్థ వైజయంతీ మూవీస్. బ్యానర్ ఏదయినా, ఈ సంస్థ నుంచి వచ్చే చిన్న, మీడియం సినిమాలు అన్నీ వైవిధ్యంగానే వుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సంస్థ మరో మంచి సినిమాకు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే ఓ బేబీ సినిమాతో సక్సెస్ కొట్టిన నందినీ రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రారంభించబోతోంది.

ఫర్ ఏ ఛేంజ్ అన్నట్లుగా హీరోను లాక్ చేసి, కథ అల్లడం కాకుండా, ఓ మాంచి లైన్ ను అనుకుని, దాని ప్రకారం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారట. స్క్రిప్ట్ ఫుల్ గా రెడీ, డైలాగ్ వెర్షన్ తో సహా అనుకున్నపుడు, ఆ టైమ్ కు కథకు సూటయ్యే హీరో ఎవరు వుంటే వాళ్లతోనే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలాచేయడం వల్ల సినిమా ఆలస్యం కాకుండా, వెంటనే స్టార్ట్ చేసి ఫినిష్ చేసే అవకాశం వుందని నిర్మాతలు, దర్శకురాలు భావిస్తున్నారు.

నవంబర్ నుంచి డేట్ లు ఇవ్వగల సూటబుల్ హీరో ఎవరు వుంటే వాళ్లతో సినిమా స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం నందినీరెడ్డి నెట్ ఫ్లిక్స్ కోసం మరికొందరు దర్శకులతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. అది పూర్తికాగానే ఇది స్టార్ట్ అవుతుంది.

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?