హీరోల వైఖరి మారుతోంది. మంచి ప్రాజెక్టులు వస్తే వదలడంలేదు. అవసరం అయితే రెమ్యూనిరేషన్ తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకునే పద్దతికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే ఈ విధంగా రాజమౌళి డైరక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
మరో హీరో నాని కూడా ఇదేబాట పడుతున్నారు. నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా కథ ఆయనకు బాగా నచ్చేసింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ డ్రామా అది. అందుకే ఆ సినిమాను మరింత ఖర్చుతో బాగా తీయమని, తనకు రెమ్యూనిరేషన్ కాకుండా, లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతకు చెప్పేసాడట.
నాని ఎప్పుడైతే ఇలాంటి ప్రపోజల్ తో వచ్చాడో, వెంటనే సినిమా ప్లానింగ్ నే మార్చేసారు. అప్పటిదాకా చిన్న మ్యూజిక్ డైరక్టర్ ను అనుకున్నారు. కానీ ఆ వెంటనే అనిరుధ్ ను ప్రాజెక్టులోకి తెచ్చారు. సెట్ వర్క్, సిజి వర్క్ అంతా కాస్త భారీగానే (నాని సినిమాల బడ్జెట్ తో పోల్చుకుంటే) వుంటుందట వ్యవహారం.
మళ్లీ రావా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు.