Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని ‘సభకు నమస్కారం’

నాని ‘సభకు నమస్కారం’

నాచురల్ స్టార్ నాని-కొత్త డైరక్టర్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు ప్రాజెక్టు ఒకటి వుంది. ఫ్రస్తుతం నాని ఓకె చేసిన నాగ్ తో మల్టీస్టారర్, అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘జెర్సీ’ సినిమాలు పూర్తి కాగానే ఇది స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు రెండు విశేషాలు వున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ టైమ్ నాని కాస్త పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ సినిమాలో నటించడం అన్నది ఓ సంగతి. దానికి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. ‘సభకు నమస్కారం’ అన్నది  ఆ టైటిల్. ఈ మధ్య పొలిటకల్ బ్యాక్ గ్రవుండ్ సినిమాలు పెరుగుతున్నాయి. మహేష్ ఓ సినిమా చేసాడు. విజయ్ దేవర కొండ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు నాని కూడా ఈ లైన్ లో చేరాడు.

ఇటు స్పోర్ట్స్ బ్యాక్ గ్రవుండ్ లో జెర్సీ, అటు పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ లో దిల్ రాజు సినిమా చేస్తున్న నాని, మరో సినిమాను త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయాలనే ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తోంది.

కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ దగ్గర విఫలం కావడంతో, హీరో నాని చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఆ విషయం ఒక్కొక్కటీ బయటకు వస్తున్న ప్రాజెక్టులతో తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?