సంపత్ నందికి చాన్స్ ఇచ్చేదెవరు?

సినిమా జంక్షన్ లో నిల్చుండిపోయారు దర్శకుడు సంపత్ నంది. 2010 లో జర్నీ స్టార్ట్ చేసి 2018 నాటికి ఇన్నింగ్స్ కు అలా పాజ్ ఇచ్చి వుండిపోయారు.   Advertisement ఏమైందీ వేళ, రచ్చ,…

సినిమా జంక్షన్ లో నిల్చుండిపోయారు దర్శకుడు సంపత్ నంది. 2010 లో జర్నీ స్టార్ట్ చేసి 2018 నాటికి ఇన్నింగ్స్ కు అలా పాజ్ ఇచ్చి వుండిపోయారు.  

ఏమైందీ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలు సంపత్ నందికి కమర్షియల్ డైరక్టర్ లుక్ తెచ్చాయి. కానీ రామ్ చరణ్ తో రచ్చ చేసి, ఏకంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు దారి చేసుకున్నారు. కానీ పాపం, అర్థాంతరంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

కానీ రవితేజ తో బెంగాల్ టైగర్ సినిమా చేసి, తన కమర్షియల్ ట్రాక్ ఒకె అనిపించుకున్నారు. కానీ ఆ తరువాతే సమస్య మొదలైంది.

గోపీచంద్ తో చేసిన గౌతమ్ నందా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమయింది. అదే సంపత్ నంది కెరీర్ కు పాజ్ బటన్ నొక్కేసింది. పెద్ద హీరోల డేట్ లు హిట్ డైరక్టర్లకే దొరకడం లేదు. అలాంటిది సంపత్ నందికి ఎక్కడి నుంచి వస్తాయి.

సంపత్ నంది బన్నీ లాంటివాళ్ల వైపు దృష్టి పెట్టుకుని కూర్చున్నారు. ఆయన మరి మీడియం హీరోల వంక ఎందుకు చూడడం లేదో?లేక వారే ఈయన వైపు చూడడం లేదో? మొత్తానికి కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది. ఈలోగా ఖాళీగా వుండలేక, పేపర్ బాయ్ అనే చిన్న సినిమా తనే నిర్మిస్తున్నారు.

బన్నీకి కథ చెప్పారు కానీ ఇంతలో విక్రమ్ కుమార్, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ వాళ్లతో లైనప్ సెట్ అయిపోయింది. మరింత ఏ టాప్ హీరో ఇస్తారు చాన్స్. రచ్చ, బెంగాల్ టైగర్ తరువాత మరో మాంచి సినిమా పడి వుంటే ఇలా వుండేది కాదు. కానీ గౌతమ్ నందా మాత్రం సంపత్ నంది స్వయంకృతాపరాధం. సరైన స్క్రిప్ట్ ను తయారుచేసుకోకుండా, భారీగా డబ్బులు మాత్రం జల్లేసారు. దాంతో అటు సినిమా విఫలమైంది. ఇటు కెరీర్ ఆగింది.

ఈరోజు సంపత్ నంది పుట్టిన రోజు. త్వరలో మంచి ప్రాజెక్టు ఆయన చేతిలోకి వస్తుందని ఆశిద్దాం.