Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని సరసన మరోసారి సాయిపల్లవి

నాని సరసన మరోసారి సాయిపల్లవి

ఎమ్ సి ఎ సినిమాలో హీరో నాని-హీరోయిన్ సాయిపల్లవి కలిసి చేసిన మ్యాజిక్ ఇప్పటికీ గుర్తు వుంది సినిమా ప్రేక్షకులు అందరికీ. మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి అవకాశం కనిపిస్తోంది. నాని సరసన మరోసారి సాయిపల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాలో చైతన్య సరసన నటిస్తోంది సాయి పల్లవి. అలాగే రానాతో విరాటపర్వం సినిమా నిర్మాణ దశలో వుంది. ఇప్పుడు ముచ్చటగా తెలుగులో మరో సినిమా ఓకె చేయబోతున్నట్లు బోగట్టా. నాని త్వరలో చేయబోయే శ్వామ్ సింఘ రాయ్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈమేరకు సాయి పల్లవికి కథ చెప్పి ఓకె చేయించుకోవడం మాత్రం వుంది. సాధారణంగా వెరైటీ కథలు, హీరోయిన్ కు ప్రాధాన్యత వున్న పాత్రలు అంటే సాయి పల్లవి నో అనదు. ఆ లెక్కన శ్యామ్ సింఘ రాయ్ కు ఓకె అంటుందనే అనుకోవాలి. ఆ విధంగా మళ్లీ మరోసారి నాని-సాయిపల్లవి ల మధ్య కెమిస్ట్రీ తెరమీదకు వచ్చి ప్రేక్షకులను అలరించబోతోంది.

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?