ఎప్పడో ప్రకటించేసారు నాని కృష్ణార్జునయుద్ధం సినిమా విడుదల డేట్ ను. ఏప్రియల్ 12న విడుదల అంటూ. కానీ ఇప్పుడేమయింది. సరిగ్గా ఆ సినిమాకు వారం రోజుల దూరంలోకి వచ్చి వాలింది భరత్ అనే నేను సినిమా.
ఇప్పుడు కింకర్తవ్యమ్? ఎందకుంటే నాని సినిమాను కాస్త గట్టి రేటుకే హోల్ సేల్ గా కొనేసారు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. అంతా వన్ వీక్ లో రికవరీ కావడం అన్నది కష్టం. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా. అందుకే మే 18కి ఏకంగా పోస్ట్ పోన్ చేసేద్దామని దిల్ రాజు అంటున్నట్లు తెలుస్తోంది.
కానీ హీరో నాని మాత్రం ఫరవాలేదు ముందుకు వెళ్లిపోదాం అంటున్నాడని తెలుస్తోంది. వన్ వీక్ లో సమ్మర్ హాలీడేస్ లో సోలోగా బాగానే రికవరీ అయిపోతుంది.
ఆ తరువాత కనీసం యాభైశాతం థియేటర్లు వున్నా చాలు టోటల్ రికవరీకి అన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది. కానీ సేఫ్ గా వుంటే కనీసం ముఫై కోట్ల బిజినెస్ చేసుకవచ్చు. అందుకోసం మే 18కి వెళ్లిపోదాం అన్నది దిల్ రాజు లెక్క అని వినిపిస్తోంది.
ప్రస్తుతానికి మే 18న విజయ్ దేవరకొండ సినిమా తప్ప మరోటి లేదు. మరి దిల్ రాజు మాటే ఖాయం అయితే ఇద్దరు యంగ్ హీరోలు ఆ రోజు ఢీకొనే అవకాశం వుంది.