నాని..సూపరెహె

థియేటర్ లో సినిమా రావాలి. థియేటర్లోనే సినిమా రావాలి. అని పట్టుపట్టుకుని కూర్చున్నాడు హీరో నాని. కానీ పాపం, వి సినిమా విషయంలోనూ పట్టు సడలించుకుని నిర్మాత కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది.…

థియేటర్ లో సినిమా రావాలి. థియేటర్లోనే సినిమా రావాలి. అని పట్టుపట్టుకుని కూర్చున్నాడు హీరో నాని. కానీ పాపం, వి సినిమా విషయంలోనూ పట్టు సడలించుకుని నిర్మాత కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ రెండో సినిమా అది కూడా వరుసగా ఓటిటి కా..నెవ్వర్ అని పట్టుదలగా కూర్చున్నాడు. 

ఏ హీరో మాట్లాడకపోయినా, స్టేజ్ మీద ఓపెన్ గా థియేటర్ వ్యవస్థకు మద్దతుగా మాట్లాడాడు. కానీ రెండో సినిమా అయిన టక్ జగదీష్ ను కూడా ఓటిటికి ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. నిజానికి ఓ విధంగా నిర్మాతకు నష్టమే. 

ఎందుకుంటే ముందుగా కమిట్ అయిన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఓటిటి అన్నాక కనీసం మూడు కోట్లు ట్యాక్స్ పోతుంది. కమిషన్లు పోతాయి. ఇన్ని ఇబ్బందులున్నా, పెద్దగా లాభాలు కళ్ల చూసే అవకాశం లేకపోయిదా, కరోనా తెచ్చిన కల్లోలం, ఆరేడు కోట్ల వడ్డీల భారం, థియేటర్ల టికెట్ ల సమస్య అన్నీ కలిసి ఓటిటి దిశగా సినిమాను మళ్లించాయి.

కానీ ఇక్కడ నానికి సమస్య. మనుటయా..మరణించుటయా..అన్నదే సమస్య. ఒప్పుకుంటే, స్టేజ్ మీద పెద్ద కబుర్లు చెప్పారు అంటారు. లేదూ అని అలా వుంచేస్తే నిర్మాత కుదేలయిపోతారు. సరే, ఏమయితే అయిందని నిర్మాత వైపే మొగ్గారు. 

కొసమెరుపు ఏమిటంటే ఓటిటి ఇవ్వడం వల్ల ఎంత అదనంగా పోతోందో చెప్పమని, తనకు వీలయింది చేస్తానని నిర్మాతకు మాట ఇవ్వడం.