కాస్త క్రియేటివిటీ వున్న డైరక్టర్ల సినిమాలు లెంగ్త్ ఎక్కువ వుంటాయి అన్నది టాలీవుడ్ జనాల లెక్క. సుకుమార్ ఇందుకు పెద్దగా మినహాయింపు కాదు. అందువల్ల నాన్నకు ప్రేమతో లెంగ్త్ ఎంత వుంటదన్నది ఆసక్తికరంగానే వుంది. రెండున్నర గంటలకు పైగానే సినిమా వచ్చిందని తెలుస్తోంది. దాన్ని రెండున్నర గంటలకు తేవాలనుకుంటున్నారని టాక్.
సినిమాలో ఇంటిలిజెంట్ ప్లే వుండడంతో, కాస్త లెంగ్త్ తప్పలేదని వినికిడి. ఇప్పుడు ఈ లెంగ్త్ ను రెండున్నర గంటలకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు సుకుమార్ అని తెలుస్తోంది. కాదూ అంటే రెండు గంటల ముఫై అయిదు నిమషాలు వుండొచ్చు అంటున్నారు. ఎన్టీఆర్ కు, నిర్మాత ప్రసాద్ కే కాదు, సుకుమార్ కు కూడా నాన్నకు ప్రేమతో సినిమా హిట్ కావడం అన్నది అనివార్యం.