నారప్ప-అంతా..ఊ..ఉత్తుత్తునే.?

ధనుష్ నటించిన అసురన్ రీమేక్ నే నారప్ప. వెంకీ హీరో. ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫారమ్ కు విక్రయించారు. విడుదలకు రెడీ అవుతోంది. దాని మీద విపరీతంగా విమర్శలు వినిపించాయి. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్…

ధనుష్ నటించిన అసురన్ రీమేక్ నే నారప్ప. వెంకీ హీరో. ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫారమ్ కు విక్రయించారు. విడుదలకు రెడీ అవుతోంది. దాని మీద విపరీతంగా విమర్శలు వినిపించాయి. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు ఇలా చేయడం ఏమిటి అని చాలా మంది బాధపడ్డారు. 

థియేటర్ల మీద ఆదాయం సంపాదిస్తూ, వాటిని చంపేసేలా ప్రవర్తించారని కామెంట్లు చేసారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సబంధించి రెండు కొత్త వీషయాలు ఈ సినిమా గురించి వినిపించాయి. 

ఒకటి సురేష్ బాబు ఒటిటి ప్లాట్ ఫారమ్ కు లేఖ రాసారని, సినిమాను వెనక్కు ఇచ్చేయమని కోరారని, థియేటర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారని. ఓ వార్త వచ్చింది. ఇది చాలదన్నట్లు అవసరం అయితే విక్టరీ వెంకటేష్ తన రెమ్యూనిరేషన్ వదిలేసుకోవడానికి సిద్దపడ్డారని మరో వార్త.

ఈ రెండు వార్తలు కూడా సురేష్ బాబు కు సన్నిహితుడైన ఓ పెద్దాయినే మీడియాలోకి వదిలారు. దాంతో ఇదంతా నిజం అనుకుని మీడియా జనాలు నమ్మేసారు. అదే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న విషయం వేరుగా వుంది. 

నారప్ప సినిమాను ఓటిటికి ఇవ్వడం, అగ్రిమెంట్ జరిగిపోవడం అన్నీ అయిపోయాయని, ఈ నెల 23న విడుదలకు కూడా రెడీ అవుతోందని, కానీ ఎగ్జిబిటర్ సెక్టార్ జనాల నుంచి, ఇండస్ట్రీలో జనాల నుంచి వస్తున్న విమర్శలను ఆపడానికి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, డబ్బులు వదులుకోవడానికి సిద్ద పడ్టారు అన్నది కూడా అలా పుట్టించిన గ్యాసిప్ మాత్రమే అని సురేష్ కాంపౌండ్ లో అలా డబ్బులు త్యాగం చేసేంత సీన్ వుండదని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద నారప్ప సినిమా ఓటిటిలో ఈ నెలలోనే విడుదలవుతోంతని గట్టిగా వినిపిస్తోంది