నర్తనశాల పంట పండింది

ఛలో సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది హీరో నాగశౌర్య ఫ్యామిలీ. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు అదే బ్యానర్ మీద చేస్తున్న రెండో సినిమా నర్తనశాల. ఛలో ఇచ్చిన హిట్,…

ఛలో సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది హీరో నాగశౌర్య ఫ్యామిలీ. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు అదే బ్యానర్ మీద చేస్తున్న రెండో సినిమా నర్తనశాల. ఛలో ఇచ్చిన హిట్, బ్యానర్ ఓ రేంజ్ లో చేసే పబ్లిసిటీతో రెండో సినిమాకు కూడా మంచి బిజినెస్ చేసేసారు. ఈనెల 30న విడుదలయ్యే సినిమాకు నాగచైతన్య-మారుతిల కాంబినేషన్ లోని  శైలజారెడ్డి అల్లుడు సినిమా పెద్ద పోటీ అవుతుంది అనుకున్నారు.

కానీ ఇప్పుడు అది వాయిదా పడేలా వుండడంతో, నర్తనశాల ఆల్ మోస్ట్ సోలో రిలీజ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఏ బ్యాకింగ్ లేని సినిమాలకు ఇలా సోలో డేట్ లు దొరకడం చాలాకష్టం. ఇదిలావుంటే నైజాం మినహా మిగిలిన ఏరియాల థియేటర్ హక్కులు, డిజిటల్, హిందీ డబ్బింగ్, శాటిలైట్ బేరం అన్నీకలిపి పదమూడు కోట్లకు పైగా బిజినెస్ చేసిందీ సినిమా. నైజాం మాత్రం స్వంతానికి వుంచుకున్నారు. సినిమా నిర్మాణానికి హీరో రెమ్యూనిరేషన్ తో, పబ్లిసిటీతో కలిపి 11కోట్ల దాకా అయిందని తెలుస్తోంది.

కేవలం పబ్లిసిటికే మూడున్నర కోట్లు ఖర్చు చేస్తున్న సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు కూడా పబ్లిసిటీ కోసం ఇంత అమౌంట్ కేటాయించలేదు. త్వరలో ప్రీరిలీజ్ ఫంక్షన్ చేసి, 30న సినిమాను విడుదల చేసే నర్తనశాలలో  యామిని, కష్మీరా హీరోయిన్లుగా నటించారు. ఉష మాల్పూరి నిర్మాత.