రెడీ టు రైజ్.. వీరభోగవసంతం

వీరభోగ వసంతరాయులు. శ్రీవిష్ణు-నారా రోహిత్-సుధీర్ బాబు-శ్రేయా తదితరులు నటించిన డిఫరెంట్ మూవీ. ఈ సినిమా మొదటి నుంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో క్యారెక్టర్ల లుక్ లు అన్నీ ఒకటీ ఒకటీ విడుదల చేస్తూ వచ్చారు.…

వీరభోగ వసంతరాయులు. శ్రీవిష్ణు-నారా రోహిత్-సుధీర్ బాబు-శ్రేయా తదితరులు నటించిన డిఫరెంట్ మూవీ. ఈ సినిమా మొదటి నుంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో క్యారెక్టర్ల లుక్ లు అన్నీ ఒకటీ ఒకటీ విడుదల చేస్తూ వచ్చారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ఇప్పుడు టీజర్ వదిలారు.

టీజర్ కూడా సినిమా టైటిల్, లుక్ మాదిరిగానే పక్కా వైవిధ్యంగా వుంది. కథను వన్ పర్సంట్ కూడా రివీల్ చేయకుండా, ఆసక్తిగా వంద సెకెండ్ల టీజర్ ను కట్ చేసారు. పైగా టీజర్ లో నారా రోహిత్ తప్ప వేరెవరు కనిపించలేదు. గుర్రం మీద వస్తున్న శ్రీవిష్ణు షాడో ఇమేజ్ మాత్రమే చూపించారు. దానిపై బిల్డ్ ఫర్ రైజ్ అనే కొటేషన్ తో ఎండ్ చేసారు.

టీజర్ కటింగ్ కానీ, ఆర్ ఆర్ కానీ, అన్నీ ఆసక్తి రేకెత్తించేలా వున్నాయి. వీరభోగవసంత రాయలు టీజర్ ఎలా వుందీ అన్నది ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ట్రయిలర్ కోసం ఆసక్తి గా చూసేటంత.