Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నష్టాల సినిమాకు బోనస్ నా?

నష్టాల సినిమాకు బోనస్ నా?

బాలయ్య సినిమాల్లో కనీవినీ ఎరుగని రేట్లకు విక్రయించేసారు ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగాన్ని. కనీసం పదోవంతు కలెక్షన్లు లేవు. సినిమా పరమవీరచక్ర టైపు డిజాస్టర్ అయింది. ఈ పరిస్థితి ముందుగానే ఊహించి కావచ్చు, మలిభాగం ముందుగానే ఫ్రీగా ఇచ్చేసారు. కానీ చిత్రమేమిటంటే ఈ రెండోభాగం ఎలా వుంటుందో తెలియదు. అది కూడా బాగా ఆడేసినా, తొలిభాగం నష్టాలు పూడ్చడం అన్నది అంత సులువుకాదు.

నెల్లూరులో కనీసం కోటిన్నర, విశాఖ, కృష్ణా కలిపి కనీసం ఆరేడుకోట్లు ఇలా భయంకరమైన రేంజ్ లో నష్టాలు వచ్చేలా వున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓ ఫీలర్ ను తెలివిగా బయటకు వదిలారు. ఈ ఫీలర్ కేవలం దర్శకుడు క్రిష్ పరువు కాపాడడానికి వదిలినట్లు క్లియర్ గా తెలిసిపోతోంది.

బయోపిక్ విషయంలో దర్శకుడు క్రిష్ పనితీరు నచ్చి, అయిదుకోట్లు బోనస్ గా బాలయ్య ఇస్తాడంటూ ఫీలర్ బయటకు వదిలారు. సినిమాకు ముందు క్రిష్ కు పదికోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముందు అసలు బయర్ల సంగతి చూడాలి. వాళ్లను ఏ విధంగా ఆదుకోవాలన్నది చూడాలి.

అసలు ఆ మాటకు వస్తే, ఈ సినిమా ప్రాజెక్టును ముందుగా ఇనీషియేట్ చేసిన నిర్మాతలు ఇందూరి విష్ణు, సాయి కొర్రపాటిలనే పక్కన పెట్టారు. వాళ్లకు సహనిర్మాతలు అన్న పేర్లే మిగిలాయి తప్ప, లాభాల్లో వాటా కాదు అని ఇండస్ట్రీ టాక్.

మరి అలాంటిది అటు బయ్యర్లు అయోమయంలో వుండగా, సహనిర్మాతల పరిస్థితి ఇలా వుండగా, డైరక్టర్ క్రిష్ కు మాత్రం అయిదుకోట్లు బోనస్ అనడం నిజమా? బోగస్ నా? అన్నది ఆలోచించాల్సిన పాయింట్. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను నేషనల్ మీడియా కానీ, అదర్ లాంగ్వేజెస్ కానీ అస్సలు పట్టించుకోలేదు.

అదే మహానటి సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్ కు మాత్రం సర్వధా ప్రశంసలు లభించాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అదే మహానటి పుట్ స్టెప్స్ ను, మేకింగ్ ను, మోడల్ ను ఫాలో అయిపోయి క్రిష్ కథానాయకుడు తీసారు. ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతోంది. అందువల్ల ఎవరూ క్రిష్ ను పెద్దగా ప్రశంసించలేదు.

ఇలాంటి నేపథ్యంలో బాలయ్య అయిదుకోట్లు బోనస్ ఇస్తున్నాడని ఫీలర్ రావడం అంటే ఇట్టే అర్థం అయిపోతుంది అసలు వ్యవహారం ఏమిటన్నది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?