Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎఫ్ 2 కుమ్మేస్తోందిగా

ఎఫ్ 2 కుమ్మేస్తోందిగా

పండగ విన్నర్ ఎఫ్ 2 అన్నది ఫస్ట్ డేనే తేలిపోయింది. కానీ రాను రాను దానికి పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే, జనాలు గత మూడునెలలుగా ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎంతలా మొహం వాచిపోయారో అర్థం అయిపోతోంది. తొలిరొజు వసూళ్లకు మూడోరోజు వసూళ్లకు మధ్య వున్నతేడా ఆ సంగతి స్పష్టంగా చెప్పేస్తోంది. ఫస్ట్ డేను దాటి వస్తున్నాయి చాలా చోట కలెక్షన్లు.

ఎన్టీఆర్ బయోపిక్ ముందుగా విడుదలైనా, ఎఫ్ 2 కలెక్షన్లు దాన్ని దాటేసాయి. మూడు రోజులకే 15కోట్ల షేర్ మార్క్ ను చేరిపోయింది ఎఫ్ 2. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లను దాటేసింది. ఎఫ్ 2కు ముందు ఇంకా వన్ వీక్ హాలీ డేస్ వున్నాయి. ఫుల్ రన్ లో యాభై కోట్ల మార్కును అందుకునే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

గడచిన రెండు సంక్రాంతులకు కూడా చివర్న వచ్చిన సినిమాలే హిట్ కొడుతున్నాయి. ఎక్స్ ప్రెస్ రాజా, శ్రీనివాస కళ్యాణం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు అన్నీ పండగ ముందు కాకుండా, పండగ రోజుల్లో విడుదలయినవే. ఈ ఏడాది కూడా బయోపిక్, వినయ విధేయ రామ, పేట సినిమాల తరువాత ఆఖర్ని వచ్చి ముందు వరుసలో నిల్చుంది ఎఫ్ 2.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?