Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

మీటూ నుంచి తప్పించుకున్న దర్శకుడు?

మీటూ నుంచి తప్పించుకున్న దర్శకుడు?

మీటూ లాంటి వ్యవహారాలు మిగతా ఇండస్ట్రీల్లో బయటకు వచ్చినంతగా టాలీవుడ్ లో రావు. ఎప్పుడో శ్రీరెడ్డి లాంటి అమ్మాయి, జనాల భాషలో బరితెగించి, ఆమె వైపు నుంచి చూస్తే అన్నింటికి తెగించి బయటకు వచ్చింది కాబట్టి ఆ మాత్రం అలజడి జరిగింది. లేదంటే అదీ వుండదు. అప్పటికీ శ్రీరెడ్డి బయటపెట్టిన ఇండస్ట్రీ పెద్ద తలకాయ కొడుకు వైనం సులువుగా పక్కకు పోనే పోయింది.

అయితే ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వుంటే చెప్పుకోవడానికి ఓ గ్రీవెన్స్ కమిటీ కూడా వేసారు. అయితే ఆ కమిటీ దృష్టికి వెళ్లకుండానో, వెళ్లినా మరీ సీరియస్ కాకుండానో ఓ ఉదంతం తప్పించుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ 'భారీ' డైరక్టర్ కు చాలామంది టాలీవుడ్ జనాల మాదిరిగానే అమ్మాయిల పిచ్చి కాస్త ఎక్కువే వుందని టాక్ వుంది. ఆయన ఒక అమ్మాయికి తన సినిమాల్లో తరచు చాన్స్ లు ఇస్తారని, ఇంకా చాలా ఫేవర్లు చేస్తారని కూడా గుసగుసలు వున్నాయి. ఇలా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ వున్నంతకాలం పరవాలేదు. తేడా వస్తేనే సమస్య.

ఆ డైరక్టర్ పై కొంతమంది ఈ గ్రీవెన్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని కొన్నాళ్ల క్రితం డిసైడ్ అయ్యారట. దాదాపు ఫిర్యాదు వరకు వెళ్లిందని కూడా టాక్ వుంది. కానీ అదే సమయంలో ఆ 'భారీ' డైరక్టర్ ఓ టాప్ హీరోతో సినిమా చేస్తున్నారు. దాంతో అది ఎఫెక్ట్ అవుతుందని, నలుగురు కలిసి, ఫిర్యాదు వరకు వెళ్లకుండానో మేనేజ్ చేసేసారని ఇప్పుడు ఆలస్యంగా బయటకు వినిపిస్తోంది.

లేదూ అంటే టాలీవుడ్ లో కూడా మీటూ గొంతు కాస్త వినిపించేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వినిపించకుండా చేయడం వరకు ఓకె. వినిపిస్తేమాత్రం ఇక్కడ జరిగేది ఏముంది? బక్క ప్రాణులైతే నిజాయితీ పొడుచుకు వస్తుంది కానీ, పెద్దోళ్లు అయితే చాలు అందరూ కలిసి మరీ వ్వవహారాలు తెరవెనుకే సెటిల్ చేసేస్తారు.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?