మహర్షి వ్యవహారం ఏమిటి?

మహేష్ బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఇప్పటికే చాలా షూట్ జరుపుకుంది. స్టూడెంట్ గా కనిపిస్తాడు హీరో. అందుకోసం డెహ్రాడూన్ లో షెడ్యూలు చేసారు. అమెరికాలో బిజినెస్ టైకూన్…

మహేష్ బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఇప్పటికే చాలా షూట్ జరుపుకుంది. స్టూడెంట్ గా కనిపిస్తాడు హీరో. అందుకోసం డెహ్రాడూన్ లో షెడ్యూలు చేసారు. అమెరికాలో బిజినెస్ టైకూన్ గా కనిపిస్తాడు. అక్కడ షెడ్యూలు ఫినిష్ చేసారు. ఇండియాలోని పల్లెకు వచ్చి, రైతులకు బాసటగా నిలిచి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే పని పెట్టుకుంటాడు.

అందుకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసారు. అక్కడ చాలా కాలంగా షూట్ చేస్తున్నారు. ఓ భారీ పాట కూడా చిత్రీకరించేసారు. ఇంత ఫాస్ట్ గా చేస్తున్నా, ఇంకా విడుదల డేట్ మీద మీమాంస తప్పడంలేదు. ఏప్రియల్ 19 లేదా 26 అనే రెండు డేట్ల మధ్య ఊగిసలాడుతోంది. దీంతో బయ్యర్ల సర్కిళ్లలో ఈ సినిమా వ్యవహారంపై గుసగుసలు మొదలయ్యాయి.

మహర్షి సినిమా ఓవర్ బడ్జెట్ అవుతోందని ఒక టాక్ వినిపిస్తోంది. అది అంత సమస్యకాదు. కానీ సినిమా బాగా స్లో నెరేషన్ గా వచ్చిందని మరో టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా మొత్తం పూర్తిచేసి, ఫైనల్ కట్ తరువాత అన్నివిధాలా చూసుకుని, అవసరమైతే రీషూట్ లు పెట్టుకుని, ఆపైనే విడుదలకు వెళ్లాలని యూనిట్ టాప్ పీపుల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే మరో వంద రోజులకు అవతల కానీ డేట్ డిసైడ్ కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు వాస్తవానికి ముగ్గురు నిర్మాతలు. పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు. అయితే దిల్ రాజు మినహా మిగిలినవారు సినిమా నిర్మాణ వ్యవహారాలు పట్టించుకోవడం లేదు. కేవలం దిల్ రాజు మాత్రమే అన్నీ చూసుకుంటున్నారు. ఆయన సినిమాల డేట్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తారు. ఇటు వారం, అటు రెండు వారాలు గ్యాప్ వుండేలా చూసుకుంటారు. అలాగే దగ్గరలో పోటీ వచ్చే సినిమాలు లేకుండా చూస్తారు. 

మొత్తానికి ఇవన్నీ కలిసి మహర్షి సినిమా విడుదల డేట్ ను ఇంకా ఫిక్స్ కాకుండా చేస్తున్నాయని ఇండస్ట్రీ టాక్.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది?