Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎఫ్ 2 కొత్త రికార్డు

ఎఫ్ 2 కొత్త రికార్డు

సంక్రాంతి హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమా నెల్లూరు జల్లాలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి తరువాత ఈ రికార్డు ఎఫ్ 2కే దక్కింది. సినిమా విడుదలైన మూడోరోజు, అది కూడా ఉదయం మార్నింగ్ షో ఎనిమిది గంటలకు వేయడం, పైగా ఏడు థియేటర్లలో ప్రదర్శించడం, అవన్నీ ఫుల్స్ కావడం ఈ రికార్డు. 

కోటి రూపాయలకు అవుట్ రేట్ కు నెల్లూరు ఏరియాకు ఈ సినిమాను కొంటే ఇప్పుడు అయిదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. కనీసం రూపాయికి రూపాయి లాభం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా వుంటే వెస్ట్, నెల్లూరు తప్ప మరే ఏరియా అవుట్ రేట్ గా అమ్మకపోవడంతో నిర్మాత దిల్ రాజుకు ఎఫ్ 2 మంచి లాభాలే పండిస్తుందని తెలుస్తోంది. కానీ ఈ సంక్రాంతికి అదే దిల్ రాజుకు డిస్ట్రిబ్యూటర్ గా వినయ విధేయ రామ సినిమాను వైజాగ్, నైజాం లకు తీసుకున్నారు. అక్కడ మాత్రం కాస్త గట్టిదెబ్బే తగిలేలా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?