మాస్ మహరాజా డబుల్ రోల్

మాస్ మహరాజా రవితేజ ఎప్పుడు డబుల్ రోల్ చేసినా ఆ కిక్కేవేరు. తన స్టయిల్ మాస్ స్టయిల్ లో కుమ్మేస్తూనే, మరోపక్క క్లాస్ టచ్ అద్దుతూ ఫ్యాన్స్ ను అలరిస్తాడు. గతంలో ఈ విషయం…

మాస్ మహరాజా రవితేజ ఎప్పుడు డబుల్ రోల్ చేసినా ఆ కిక్కేవేరు. తన స్టయిల్ మాస్ స్టయిల్ లో కుమ్మేస్తూనే, మరోపక్క క్లాస్ టచ్ అద్దుతూ ఫ్యాన్స్ ను అలరిస్తాడు. గతంలో ఈ విషయం ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు డిస్కోరాజా సినిమాలో.

డిస్కో రాజా సినిమాలో తండ్రీ కొడుకులుగా రవితేజ డబుల రోల్ చేస్తున్నాడు. గమ్మత్తు ఏమిటంటే ఇందులో తండ్రి పాత్ర మాస్, కొడుకు పాత్ర క్లాస్ అని వినిపిస్తోంది.

ఇప్పటికే అనేకసార్లు డిస్కోరాజా కథాంశం మీడియాలో కనిపిస్తూనే వచ్చింది. తండ్రి కోమాలోకి వెళ్లి చాలా ఏళ్ల తరువాత తిరిగిరావడం, అప్పటికి కొడుకు పెద్దయి వుండడం అన్నది పాయింట్ అని తెలుస్తూనే వుంది.

అంటే బహుశా ఒకే ఏజ్ లోని తండ్రి కొడుకు కలిసి క్లాస్ అండ్ మాస్ స్టయిల్స్ తో ప్రేక్షకులను అలరించే ప్లాన్ ఏదో వున్నట్లుంది. విఐ ఆనంద్ డైరక్షన్ లో రామ్ తాళ్లూరి సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సినిమా మీద పోటీగా మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి కానీ, రవితేజ్ మాస్ పంచ్ సరిగ్గా పడాలే కానీ, రేంజ్ మామూలుగా వుండదు.