తమిళనాడు వ్యవహారాలు చాలా స్ట్రేంజ్ గా ఉంటాయి. ప్రత్యేకించి అక్కడి సినిమా వాళ్ల, రాజకీయ నేతల లెక్కలు ఎలా ఉంటాయో, ఎవరి ఆశలు ఎక్కడకు ఎక్కుపెట్టబడి ఉంటాయో చెప్పడం కష్టం. సినీపరిశ్రమ, రాజకీయం అక్కడ సయామీ కవలల్లా సాగుతూ ఉంటాయి. సినీతారలను సీఎంలుగా చేసుకున్న రాష్ట్రమే కాదు.. వాళ్లకు గుళ్లను కట్టుకునే సంప్రదాయం ఉన్న రాష్ట్రం అది. కాబట్టి అక్కడ సినిమా వాళ్లు ఏమైనా చేయగలరు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా నయనతార కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కానూవచ్చు.
విషయం ఏమిటంటే.. ఈ మేరకు ఒక జ్యోతీష్యుడు చెప్పాడట. ఇప్పుడు కాదు.. దశాబ్దం కిందటే చెప్పాడట. నయనతారకు ముఖ్యమంత్రి పదవీయోగం ఉందని తమిళనాడుకు చెందిన ఒక జ్యోతీష్యుడు ఆమెకే చెప్పాడట. పెళ్లి చేసుకోవద్దని.. పెళ్లి చేసుకుంటే రోడ్డున పడతావని, అవివాహితగానే మిగిలిపోతే ముఖ్యమంత్రివి అవుతావని ఆమెకు ఆ జ్యోతీష్యుడు చెప్పాడట.
ఈ కేరళ కుట్టికి ఇలా తమిళనాట సీఎం యోగముందని ఆ జ్యోస్యుడు చెప్పాడనుకోవాలి. అయితే ఈ జోస్యాన్ని నయనతార నమ్మిందో లేదో తెలీదు. ఈ విషయాన్ని ఆమె చెప్పలేదు కూడా. తమిళ దర్శకుడు నందు ఈ విషయాన్ని చెప్పాడు.
శింబు, నయనలు ప్రేమలో ఉన్న రోజుల్లో వాళ్లిద్దరూ జ్యోతీష్యుడు దగ్గరకు వెళ్లారని.. అప్పుడు అలా జరిగిందని ఆ దర్శకుడు చెప్పాడు. నయన ఆ జోస్యాన్ని నమ్మిందో లేదో కానీ.. ఇప్పటికీ ఆమె అధికారికంగా అవివాహితగానే ఉంది.
ఆమె ప్రియుళ్లు మారారు కానీ.. అఫిషియల్ గా నయనతార అవివాహితే. మరి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందేమో!