Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరవిందను ఈ యాంగిల్ లో చూడండి

అరవిందను ఈ యాంగిల్ లో చూడండి

టాప్ హీరోలు అంటే మనీ మెషీన్లు అనుకోవాలా? ఎంతసేపూ ఫస్ట్ డె, ఫస్ట్ వీకెండ్, లైఫ్ టైమ్ షేర్ లు ఇవే లెక్కలా? నిన్న, ఇవ్వాళ సోషల్ నెట్ వర్క్ లో ఇదే హడావుడి. అభిమానుల పాజిటివ్ స్పందనలు, వేరే హీరోల అభిమానుల కౌంటర్లు. ఇంత వచ్చింది అంటే అంత వచ్చిందా అంటూ.. ఇదే సందడి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ను పూర్తిగా విస్మరిస్తున్నారు.

పెద్ద హీరోలు అంటే భారీ వసూళ్లే కాదనలేం. కానీ ఇప్పుడు దాంతో పాటు పెద్ద హీరోల అభిరుచి కూడా మారింది. తమ నటనకు కూడా పేరు రావాలని, మంచి నటులు అనిపించుకోవాలని కూడా చూస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ అయిదు హిట్ లు కాదు లెక్క.. అయిదు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు.

నటుడిగా ఎన్టీఆర్ కు తిరుగులేదనేంతగా చూపించిన స్టామినా. అరవిందలో ఫస్ట్ ఫైట్ దగ్గర నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఇచ్చిన సెటిల్డ్ ఫెర్ ఫార్మెన్స్ దాని గురించి అభిమానులు మాట్లాడడం లేదు. ఎంతసేపూ కలెక్షన్లు. కలెక్షన్లు.

మిగిలిన హీరోల అభిమానుల కూడా అంతే. వాళ్ల హీరోల కలెక్షన్లే. రంగస్థలంలో రామ్ చరణ్ ఇచ్చిన పెర్ ఫార్మెన్స్. అసలు ఆ పాత్రను చేయడానికి, కథను అంత నాటుగా తీయడానికి ఒప్పుకున్నవైనం. నాపేరు సూర్య ఫ్లాప్ కావచ్చు. కానీ బన్నీ పెర్ ఫార్మెన్స్ కు వంకలేదు.

భరత్ అనే నేను విషయంలో మహేష్ స్టయిలిష్ నటన మెచ్చుకోదగ్గదే. ఇలా ఇప్పుడు టాప్ హీరోలంతా సరైన పెర్ ఫార్మెన్స్ వున్న పాత్రలు, సరైన డైరక్టర్ల కోసం వెదుకుతున్నారు. 150 సినిమాలు చేసేసిన చిరంజీవి ఎందుకు ఇప్పుడు సైరా చేస్తున్నది, కొరటాల శివను బ్లాక్ చేసింది? పేరు కోసమే.

ఇప్పడు అందరు హీరోలు ఫెర్ ఫార్మర్లు అనిపించుకోవలని చూస్తున్నారు. అందువల్ల అభిమానులు కూడా మారాలి. తమ తమ హీరోల నటన గురించి మాట్లాడుకోవాలి. సినిమాల్లో వారు సత్తా చూపిన సీన్ల గురించి మాట్లాడుకోవాలి.

కలెక్షన్ల కోసం వాదించుకోవడం కాదు. పాత్రలు బాగుంటే సినిమా బాగుంటుంది. సినిమా బాగుంటే కలెక్షన్లు అవే వస్తాయి. అభిమానులు ఈ దిశగా ఆలోచించాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?