సాధారణంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే కోటి రూపాయిలకు వరకు తీసుకుంటుంది పారితోషికం అని లెక్క. అయితే రాను రాను హీరోయిన్లు రేట్లు పెంచుతున్నారు. శృతి హాసన్ రేటు కోటి ఎప్పుడో దాటేసింది. నయనతార కూడా కోటిన్నర నుంచి రెండు కోట్లు తీసుకుంటోందట.
ఇప్పుడు తాజాగా వెంకీతో కలిసి మారుతి డైరక్షన్ లో నటించేందుకు కోటిన్నరకు పైగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పారితోషికం మాత్రమే. ఇది కాక, ఇంకా అదనపు హంగులు, ఖర్చులు చాలానే వుంటాయి. పెద్దగా హిట్ లు లేకున్నా, సినిమాలు మాత్రం నయన తారకు చేతినింటా వుంటూనే వస్తున్నాయి చాలా కాలంగా.
అందువల్లే కావచ్చు ఆమె తన పారితోషికాన్ని ఆ రేంజ్ కు పెంచి వుంటుంది. పైగా వెంకీకి ఇక్కడ ఆప్షన్లు కూడా తక్కువ. యాభైలు దాటేసిన హీరోలకు హీరోయిన్లను ఎంచుకునే ఛాన్స్ రోజు రోజుకు తగ్గిపోతోంది మరి. అందువల్ల అలా సెట్ అయినవారికి అడిగినంతా ఇవ్వక తప్పదు.