నయనతార పారితోషకం.. పతాక స్థాయికి!!

మొన్నటి వరకూ నయనతార మూడు కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటోందనే మాట వినిపించేది. ప్రస్తుతం ఇండస్ట్రీలో దక్షిణాది అమ్మాయిలు కానీ, ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడే సెటిలైన వారు కానీ.. ఆ మాత్రం డిమాండ్…

మొన్నటి వరకూ నయనతార మూడు కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటోందనే మాట వినిపించేది. ప్రస్తుతం ఇండస్ట్రీలో దక్షిణాది అమ్మాయిలు కానీ, ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడే సెటిలైన వారు కానీ.. ఆ మాత్రం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. వరస విజయాల మీదున్న క్రేజీ హీరోయిన్లు కూడా కోటీ, రెండు కోట్లు.. అనే దగ్గరే ఉన్నారు.

అయితే నయనతార, అనుష్కలు మాత్రం మూడు కోట్ల రేంజ్ నటీమణులుగా పేరు పొందారు. అయితే ఇప్పుడు నయనతార రేంజ్ ఈ స్థాయిని దాటిపోయిందట. ఏకంగా ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని చార్జ్ చేస్తోందట ఈ హీరోయిన్. ఈ విషయాన్ని ఒక తమిళ నిర్మాత ఏకరువు పెట్టాడు. నయనతార రెమ్యూనరేషన్ ఐదు కోట్లకు చేరిందని అతడు అంటున్నాడు.

కేవలం అంతటితో ఆగడం లేదు అని.. ఐదు కోట్ల రూపాయలు ఆమె పారితోషకం మాత్రమే, ఇక ఆమె ఇతర ఖర్చులు, విమానం టికెట్లు, హోటల్ టికెట్లు, వ్యక్తిగత సిబ్బంది ఖర్చలు, భోజనం బిల్లులు అదనం.. అని ఈమెతో సినిమా రూపొందించిన అనుభవం ఉన్న ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ కూడితే మరో యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు అవుతుందని అతడు అంటున్నాడు.

ఏతావాతా.. నయనతారను హీరోయిన్ గా అనుకుంటే.. ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. అయినా.. ఏం ఊరికే ఇస్తున్నారా? ఆమెతో సినిమాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. నయనతార, అనుష్కలతో సినిమాలు అంటే.. అవి ఇప్పుడు సౌత్ లోని మూడు ప్రధాన భాషల్లో అమ్ముడుపోతాయి. హిందీ డబ్బింగులు ఎలాగూ ఉండనే ఉంటాయి. అందుకే ఈ క్రేజ్ ను వారు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో నయనతార మరింత ముందుంది!