దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న నయనతార అతడిని పెళ్లాడేందుకు తొందర పడడం లేదు. గతంలో తన ప్రేమ వ్యవహారాలని పెళ్లి వరకు తీసుకెళ్లాలని తొందర పడి కెరీర్‌ని ప్రశ్నార్ధకం చేసుకుంది. అయితే లక్కీగా టైమ్ కలిసి వచ్చి తన స్టార్‌డమ్‌ని తిరిగి సాధించగలిగింది.
అందుకే ఈసారి నయనతార తెలివిగా వ్యవహరిస్తోంది. విఘ్నేష్‌తో లవ్ డీప్‌గా వున్నప్పటికీ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. ప్రస్తుతం తనకి తమిళంలోనే కాక తెలుగు చిత్ర సీమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. పైగా ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడడం లేదు. ఇలాంటి టైమ్‌లో పెళ్లి పేరుతో ఇండస్ట్రీకి దూరమవడం తెలివితక్కువతనమని ఆమె రియలైజ్ అయింది.
అవకాశాలు వచ్చినంత కాలం సంపాదించుకుని, ఛాన్సుల్లేవని అనుకున్నప్పుడే రిటైర్ అవుదామని డిసైడ్ అయింది. మామూలుగా ఏదైనా ప్రోడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వుండడానికి ఇష్టపడని నయనతార ఇప్పుడు ఆ ఫిలాసఫీ కూడా పక్కన పెట్టేసింది. యాడ్ డీల్స్ కూడా ఒప్పుకుంటూ రెండు చేతులా దండుకుంటోంది.