పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు కానీ, బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో ఫారిన్ టూర్స్ మాత్రం జోరుగా చేస్తోంది నయనతార. ఇప్పటికే ఈ జంట రెండుసార్లు అమెరికా వెళ్లొచ్చింది. బోర్ కొట్టిందేమో, ఈసారి ప్లేస్ మార్చారు. నయన్-విఘ్నేష్ కలిసి గ్రీస్ వెళ్లారు.
ఇండియాలో ఎండలు మండిపోతున్న వేళ, వీళ్లిద్దరూ ఇలా గ్రీస్ లో చల్లగా గడిపేస్తున్నారు. ఎప్పట్లానే ఈ టూర్ ను కూడా వీళ్లు గోప్యంగా ఉంచదలచుకోలేదు. ఎప్పటికప్పుడు తమ గ్రీస్ టూర్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది ఈ జంట.
ప్రస్తుతం నయనతార, చిరంజీవి సరసన సైరా సినిమా చేస్తోంది. అటు రజనీకాంత్ సరసన దర్బార్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కు ఇప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ విరామంలో ప్రియుడితో కలిసి ఇలా ఫారిన్ చెక్కేసింది నయనతార.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది వీళ్లిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకుంటారట. పెళ్లి మాత్రం మరో ఏడాది గ్యాప్ ఇచ్చి చేసుకుంటారట. నయన్ గ్రీస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత దర్బార్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.