ఈ శుక్రవారం దగ్గరకు వచ్చేస్తోంది. కానీ ఇండస్ట్రీ జనాల దృష్టి అంతా వచ్చే శుక్రవారం మీదే వుంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలు ఢీ కొంటున్నాయి. బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమా జయ జానకీ నాయక. ఈ సినిమాకు మిరియాల రవీందర్ నిర్మాత. ఈ సినిమా సెన్సార్ బుధవారం ఉదయం సెషన్ లో జరుగుతోంది.
ఇక భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి కలిసి తేజ డైరక్షన్ లో నిర్మించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సెన్సారు బుధవారం మధ్యాహ్నానికి డిసైడ్ చేసారు. రానా-కాజల్ ఈ సినిమాలో కీలక పాత్ర ధారులు.
ఈ రెండు సినిమాలతో పాటు విడుదలకు రెడీ అయిన హను రాఘవపూడి-నితిన్ కాంబో సినిమా లై. ఈ సినిమా సెన్సారును గురువారం షెడ్యూలు చేసారు. ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత.