“ఒక గ్రామంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిలో ప్రేమ కనిపిస్తుంది. మరికొందరిలో కోపం కనిపిస్తుంది. ఇంకొందరు వ్యక్తులు పూర్తిగా స్వార్థంతో ఉంటారు. మరికొందరిలో జెలసీ కనిపిస్తుంది. ఇలా ఎంతమంది ఎన్ని స్వభావాలతో ఉన్నప్పటికీ, ఊరికి ఓ సమస్య వచ్చిందంటే మాత్రం అంతా ఒక్కటైపోతారు. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్న గ్రామం నాకు ఓ రంగస్థలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చెబుతున్నాను కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం అని పేరుపెట్టాను.” రామ్ చరణ్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం వెనక రీజన్ ఇదే అంటున్నాడు సుకుమార్.
రంగస్థలం టైటిల్ వెనక మొన్నటివరకు చాలా ఊహాగానాలు నడిచాయి. రంగస్థలం అనేది ఒక ఊరు పేరని కొందరన్నారు. రామ్ చరణ్ పెట్టిన డ్రామా కంపెనీకి ఈ పేరు పెట్టారని మరికొందరన్నారు. కానీ కేవలం కథను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టామంటున్నాడు సుకుమార్. దర్శకుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు సుక్కు.
అయితే సుకుమార్ చెబుతున్న విషయాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కథ ప్రకారమే ఈ టైటిల్ పెడితే మేకింగ్ లో రంగస్థలం అనే బోర్డును ఎందుకు వాడుతున్నట్టు? అనసూయ, సమంత లాంటి తారలు అదే బోర్డు వద్ద సెల్ఫీలు కూడా ఎందుకు దిగినట్టు. సో.. రంగస్థలం అనే ఎలిమెంట్ కు సినిమాతో కచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఆ విషయాన్ని మాత్రం సుకుమార్ చెప్పడంలేదు.