నేను చీప్‌గా చేస్తా కదా అంటున్న ఛార్మి!

ఛార్మి తెలుగుతెరమీద ఒకప్పటి అగ్రనాయిక. కెరీర్‌ మొదలైన కొన్నాళ్లలోనే అగ్రహీరోలు అందరి సరసన ఛాన్సులు కొట్టేసిన ముద్దుగుమ్మ. ఇదంతా నిజమే. కానీ ఎంతగా పెర్ఫార్మెన్స్‌ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఆమె అవకాశాలు బాగా సన్నబడ్డాయి.…

ఛార్మి తెలుగుతెరమీద ఒకప్పటి అగ్రనాయిక. కెరీర్‌ మొదలైన కొన్నాళ్లలోనే అగ్రహీరోలు అందరి సరసన ఛాన్సులు కొట్టేసిన ముద్దుగుమ్మ. ఇదంతా నిజమే. కానీ ఎంతగా పెర్ఫార్మెన్స్‌ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఆమె అవకాశాలు బాగా సన్నబడ్డాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో తనే సొంతంగా పేరు తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఒక కారణం కావొచ్చు. కానీ ఆ తర్వాతి రోజుల్లో… ఛార్మి కేవలం అయిటం సాంగ్స్‌కు మాత్రం పరిమితం అవుతూ వచ్చింది. సాంగ్స్‌ కోసం తప్ప ఆమెను ఫుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్రలకు సంప్రదిస్తున్న వారు లేకపోవడం విశేషం. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోకి బాలీవుడ్‌నుంచి ఎంట్రీ ఇస్తున్న సన్నీలియోన్‌ ఛాన్సుల్ని చూసి.. చార్మి కుతకుతలాడిపోతోందని వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్‌ హీరోగా తయారవుతునన కరెంట్‌తీగ చిత్రంలో సన్నీలియోన్‌ ఓ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. టీచరు పాత్రలో చేస్తున్న సన్నీ ఓ లుంగీ డ్యాన్స్‌ కూడా చేసి అలరించిందని వార్తలొచ్చాయి. 

అయితే ఈ చిత్రంలో చేయడానికి సన్నీ లియోన్‌కు చాలా భారీ రెమ్యూనరేషన్‌ ముట్టజెప్పారని వార్తలు వస్తుండగా.. అంతకంటె తక్కువ ఇచ్చినా నేను చక్కగా చేసి ఉండేదాన్నిగా అంటూ ఛార్మి తన సన్నిహితుల వద్ద వాపోతోందిట. తన సన్నిహితుల ద్వారా సినిమా మేకర్లకు తనను ఎంచుకునేందుకు సంకేతాలు పంపుతోందిట. కానీ అవకాశాలు మాత్రం తలుపుతట్టడం లేదు. ఎందుకో మరి!!