ఏదో డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నామన్న కలరింగ్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నారు నీదీ నాదీ ఒకే కథ యూనిట్ జనాలు. కానీ సినిమాకు రావాల్సిన బజ్ అయితే రావడం లేదు.
లేటెస్ట్ గా యూత్ ఏంథెమ్ అంటూ హల్ చల్ చేసి పాట వదిలారు. తీరా చూస్తే, నేను లోకల్ లో 'నెక్స్టేంటీ' పాటకు నకలు అన్నట్లుగా వుంది.
అసలు సినిమా లైన్ చూస్తేనే అనేకానే మధ్యతరగతి హీరో కథ సిరీస్ లో మరో సినిమా మాదిరిగా కనిపిస్తోంది. దానికి తోడు ఈ పాట చూస్తే, ఆ పాట హిట్ అయిందని, ఇలా తయారుచేసుకున్నట్లు వుంది.
ఎంత ట్రయ్ చేసినా, శ్రీవిష్ణుకు ఓ ఇమేజ్ రావడంలేదు. ఉన్నది ఒకటే జిందగీ మీద చాలా ఆశలే పెట్టుకుంటే, అవి కాస్తా నీరుగారిపోయాయి. ఇప్పుడు తన శ్రీమతి ప్రశాంతి, తన స్నేహితుడు రోహిత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
కథ చూస్తుంటే శ్రీ విష్ణు లుక్స్ కు సరిపోయేలాగే వున్నాయి. కానీ ఇప్పుడు యూత్, సరదాల సినిమాలు చూడమంటే చూస్తున్నారు తప్ప, రియలిస్టిక్ మిడిల్ క్లాస్ మూవీస్ చూడమంటే చూస్తారా? అన్నది అనుమానం. చూస్తే శ్రీ విష్ణు ఆశలు నెరవేరతాయి. లేదంటే లేదు.