పెళ్లయితే కానీ పిచ్చి కుదరదు..పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు అన్నది సామెత. నాగ్ చైతన్య-సాయి పల్లవిల 'లవ్ స్టోరీ' విడుదల వ్యవహారం అలాగే వుంది.
లవ్ స్టోరీ విడుదల కావాలంటే బోలెడు షరతులు వున్నాయి. 1. ఆంధ్రలో టికెట్ రేట్లు పెరగాలి. 2. ఆంధ్రలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ఇవ్వాలి. 3. పోటీగా మరే సినిమా రాకూడదు. 4. కనీసం ఓటిటిలో కూడా పోటీగా మరే సినిమా విడుదల కాకూడదు. 5.ఆంధ్రలో సెకెండ్ షో లకు అనుమతి ఇవ్వాలి.
ఇలా రూల్సు పెట్టుకుని కూర్చోవడంతో అసలు ఇక లవ్ స్టోరీ థియేటర్లలోకి వస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వినాయక చవితి మీద అంక్షలు విధించారు కాబట్టి ఇప్పట్లో థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వరు. కనీసం 20 వ తేదీ దాటాలి.
అలాగే ఇప్పటికే కర్ఫ్యూ గట్టిగా రాత్రి ఆరేడు గంటలు మించి లేదు. సెకెండ్ షో కావాలంటే ఇవన్నీ ఎత్తేయాలి. ఇక టికెట్ రేట్ల కసరత్తు జరుగుతోంది ఎప్పటికి వస్తాయో తెలియదు
ఈ రూల్స్ అన్నీ ఈ నెల 15 నాటికి పుల్ ఫిల్ అయితే వారం రోజులు పబ్లిసిటీకి చాలు అనుకుని సినిమా వదులుతారు. లేదూ 25 నాటికి వచ్చాయి అనుకోండి. ఇక సినిమా రాదు. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి వరుసగా సినిమాలు వున్నాయి. అక్టోబర్ నెలంతా సినిమాలే.
మరే ఒక్క సినిమా విడుదల వున్నా, అది ఎంత చిన్న సినిమా అయినా లవ్ స్టోరీకి భయమే. అందుకే చూస్తుంటే లవ్ స్టోరీ విడుదల నెవ్వర్ ఎండింగ్ స్టోరీలా వుంది.