Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరీక్షల సినిమాలు వస్తున్నాయ్

పరీక్షల సినిమాలు వస్తున్నాయ్

జూలై, ఆగస్టు నెల టాలీవుడ్ వ్యవహారం చూస్తుంటే హీరోలు అందరికీ పరీక్షకాలం మాదిరిగా వుంది. పోస్ట్ సమ్మర్ లో విడుదలయ్యే సినిమాలు అన్నీ హీరోలకు లైఫ్ అండ్ డెత్ అన్న రేంజ్ లో వుంది వ్యవహారం. మరో యాంగిల్ లో చూస్తుంటే నిర్మాతలు, దర్శకులకు కూడా ఈ సినిమాలు పరీక్షల మాదిరిగానే కనిపిస్తున్నాయి. దాదాపు ఆరేడు సినిమాలు విడుదులవుతున్నాయి. అన్ని సినిమాలు కూడా హీరోలకు, దర్శకులకు పరీక్షలు పెట్టే సినిమాలే కావడం యాధృచ్చికం అనుకోవాల్సిందే.

జూలై 12న సందీప్ కిషన్ 'నిను వీడను నీడను నేనే' సినిమా విడుదలవుతోంది. సందీప్ కిషన్ తన సర్వశక్తులు ఒడ్డి, స్వంతంగా నిర్మించిన సినిమా. విపరీతమైన టెన్షన్ తో వుంది సందీప్ భవిష్యత్. ఈ సినిమా కాస్త ఫరావలేదు అనిపించుకుంటేనే సందీప్ అడుగు ముందుకు పడుతుంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయినా చాలు. మళ్లీ సందీప్ మరో ప్రయత్నం చేస్తాడు. లేదూ అంటే ఇక కష్టకాలమే. కేవలం హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా.

అదేరోజున ఆనంద్ దేవరకొండ తొలి సినిమా దొరసాని విడుదలవుతోంది. అన్న విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు ఆనంద్. ఈ సినిమా హిట్ కాకపోతే అతనికి సినిమా కెరీర్ ఇక్కడే ఆగిపోయే ప్రమాదం వుంది. అంతేకాదు, సోదరుడి వైఫల్యం అంటే కాస్త విజయ్ కు కాస్త ఇబ్బందిగానే వుంటుంది.

ఇదే సినిమాకు నిర్మాత మధుర శ్రీధర్. ఆయన అనేక సినిమాలు తీసారు. కానీ పెద్దగా డబ్బులు సంపాదించిన దాఖలాలు లేవు. ఏదో కిందామీదా పడి సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా అయినా విజయం సాధించి, ఆయనకు ఓ రూపాయి లాభం రావాల్సి వుంది. లేదూ అంటే ఆయన సినిమాలు కొనసాగించడం కష్టం.

దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా తొలిసారి నటించిన రాజ్ దూత్ సినిమా 12నే విడుదలకు రెడీ అవుతోంది. శ్రీహరి, డిస్కోశాంతిల నట వారసుడిగా ఈ సినిమాను గట్టెక్కించుకుంటేనే మేఘాంశ్ ముందుకు సాగగలడు. లేదూ అంటే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ సినిమా కూడా అతని పరీక్షనే.

ఇదే సినిమాకు నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాధ్. అలాగే చార్మి కూడా నిర్మాతనే. టెంపర్ తరువాత హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు పూరి. ఈ సినిమా హిట్ కాకపోతే చాలా కష్టం. డైరక్టర్ గానే కాదు, నిర్మాతలుగా పూరి, చార్మిలకు ఇంకా ఎక్కువ కష్టం. ఇప్పటికే చాలా నష్టాలు చవిచూసాడు అందువల్ల ఇంకా నష్టాలు భరించే స్థితిలో లేడు. ఇది హిట్ అయితేనే మరో సినిమా చేయడం. లేదు అంటే ఇక ఫుల్ స్టాప్ అనుకోవాలి.

ఈనెల 25న విడుదలవుతోంది డియర్ కామ్రేడ్. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండకు పరీక్ష ఏమీకాదు. కానీ ఈ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ హోదాకు చేరిపోతాడు. అందులో ఆణుమాత్రం సందేహం లేదు. టాప్ హీరోల సరసకు చేరుకుంటాడు. అది జరగాలంటే డియర్ కామ్రేడ్ హిట్ కావాల్సిందే.

ఆగస్టు 2న వస్తోంది బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు'. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితి ఏమిటన్నది జనాలకు తెలియంది కాదు. వరుస ఫ్లాపులతో కిందామీదా అవుతున్నాడు. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రాక్షసుడు సినిమా కాస్త బెటర్ అనిపించుకుంటేనే బెల్లంకొండ శ్రీనివాస్ అడుగు ముందుకు పడుతుంది. లేకపోతే కష్టమే.

ఆగస్టు 2 రావడానికి అవకాశం వున్న మరో సినిమా రణరంగం. ఈ సినిమా హీరో శర్వానంద్ కు, డైరక్టర్ సుధీర్ వర్మకు ఇద్దరికీ పరీక్షనే. శర్వానంద్ సరైన హిట్ కోసం చూస్తున్నాడు. సుధీర్ వర్మ అయితే సరేసరి. ఈ సినిమా పాసైతేనే సుధీర్ వర్మకు మరో సినిమా. శర్వానంద్ కు కనీసం ఫరవాలేదు. సినిమాలువున్నాయి. కానీ మార్కెట్ స్టడీగా వుండాలి అంటే ఈ సినిమా పరీక్ష పాస్ కావాలి.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?