Advertisement


Home > Movies - Movie Gossip
చిరంజీవి సినిమాకు వేరే టైటిల్..?

చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శరవేగంగా ముస్తాబవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, చిరు బర్త్ డే రోజున ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు ఇదే పేరు పెడతారనే గ్యారెంటీ లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది యూనిట్. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత టైటిల్ మారే అవకాశం ఉందట.

ఉయ్యాలవాడ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిరు 150వ సినిమాకు కూడా చెర్రీనే నిర్మాత. ఆ మూవీ టైటిల్ కూడా షూటింగ్ టైమ్ లో మారింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన కొత్తలో వినాయక్ ఒక టైటిల్ ఫిక్స్ చేశారు. ఏకంగా దర్శకుడే ప్రకటించడంతో అంతా అదే టైటిల్ అనుకున్నారు. కానీ అది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ప్రకటించిన చరణ్.. తర్వాత సినిమాకు ఖైదీ నంబర్ 150 అని పేరుపెట్టారు. ఇప్పుడు ఉయ్యాలవాడ ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే రిపీట్ కాబోతోందని టాక్.

ఉయ్యాలవాడ ప్రాజెక్టుకు టైటిల్ మార్చాలనే ఆలోచన వెనక మరో ఉద్దేశం కూడా ఉంది. ఈ సినిమాను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్ తో చర్చలు జరుపుతున్నారు. అలా మూవీని బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న యూనిట్, “ఉయ్యాలవాడ” స్థానంలో అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఓ కామన్ టైటిల్ పెట్టే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.