కొణిదెల నీహారిక, అచ్చమైన తెలుగింటి ఆడపిల్ల. అలాంటి పిల్లను చూస్తే తండ్రి వయసులో వున్న ఎవరికైనా ముచ్చటగానే వుంటుంది. క్యారెక్టర్ యాక్టర్ మురళీశర్మకు కూడా అలాగే అనిపించిందట. హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ టైమ్ లో, నీహారిక అల్లరి, ఆట, పాట చూసి, మురళీశర్మ ఆమెతొనే ఎక్కువ కాలక్షేపం చేసాడట. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ ఆడిన సరదా ఆటల వీడియో సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొడుతోంది.
ఇంకో గమ్మత్తేమిటంటే, నీహారిక ఇంటికి వెళ్లి తండ్రి నాగబాబుకు చెప్పిందట, మురళీశర్మ అంకుల్ నన్ను అడాప్ట్ చేసుకుంటారట అని సరదాగా చెప్పిందట. అది విని నాగబాబు పెద్దగా నవ్వేసారట.
మురళీశర్మ ఈ మధ్య టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఫాదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. భలే భలే మగాడివోయ్ సినిమాతో డైరక్టర్ మారుతి ఆయన లైన్ మార్చేసారు. ఇప్పుడు సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్ అంటే మురళీ శర్మనే. ఈ మధ్య విజేత సినిమాలో ఆయన యాక్టింగ్ ను మెగాస్టార్ కూడా మెచ్చకున్నారు.