నిజంగా చిన్న సినిమాలే

ఈవారం రెండు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. అంధగాడు, ప్యాషన్ డిజైనర్ సినిమాలు బడ్జెట్ పరంగానే కాదు, నిడివి పరంగా కూడా చిన్న సినిమాలే. ఈ మధ్య జనం రెండు గంటలు దాటితే సినిమా చూడలేకపోతున్నారు.…

ఈవారం రెండు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. అంధగాడు, ప్యాషన్ డిజైనర్ సినిమాలు బడ్జెట్ పరంగానే కాదు, నిడివి పరంగా కూడా చిన్న సినిమాలే. ఈ మధ్య జనం రెండు గంటలు దాటితే సినిమా చూడలేకపోతున్నారు. అది దృష్టిలో వుంచుకుని నిర్మాతలు, డైరక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఫ్యాషన్ డిజైనర్ నిడివి అన్ని టైటిల్ కార్డులు, కలిపి రెండు గంటల లోపేనట. ఇంటర్వెల్ అయితే గంటలోపే వచ్చేస్తుందట. సినిమా సెన్సారు అయిన తరువాత కూడా, జాగ్రత్తగా చూసి, ల్యాగ్ అన్నది ఎక్కడ ఏమాత్రం అనుమానం వున్నా నిర్దాక్షిణ్యంగా లేపేసారట.

ఫ్యాషన్ డిజైనర్ సినిమాను అమ్మలేదు. వైజాగ్, బెంగుళూరు, ఓవర్ సీస్ మాత్రమే అమ్మారు. మిగిలిన ఏరియాలు సురేష్ మూవీస్ దగ్గర వుంచారు. సో, దగ్గుబాటి సురేష్, ఇంకా మరి కొందరి సలహాలతో సినిమాను ఒకటికి పదిసార్లు చెక్ చేసి, నిడివి కోసుకుంటూ వచ్చారని తెలుస్తోంది.

ఇక అంధగాడు సినిమా స్క్రిప్టే చిన్నది. అందువల్ల నిడివి అన్నీ కలిపి రెండు గంటల 12 నిమషాలు వచ్చిందట. ఇందులోనే టైటిల్ కార్డులు, సిగరెట్, మద్యం ప్రకటనలు కూడా. అంటే సినిమా దాదాపుగా రెండు గంటల్లో ముగిసిపోతుందన్నమాట.