నిక్‌ – ప్రియాంక.. పెళ్ళి తెచ్చిన తలనొప్పి.!

తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్ళాడటంపై బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి ఫుల్‌ క్లారిటీవుంది. క్లారిటీ లేకుండానే, నిక్‌ జోనాస్‌ని ప్రేమించిందా.? అతనితో కలిసి పెళ్ళి పీటలదాకా వెళ్ళిందా.? కానీ, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు…

తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్ళాడటంపై బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి ఫుల్‌ క్లారిటీవుంది. క్లారిటీ లేకుండానే, నిక్‌ జోనాస్‌ని ప్రేమించిందా.? అతనితో కలిసి పెళ్ళి పీటలదాకా వెళ్ళిందా.? కానీ, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో ప్రియాంకా చోప్రా 'కూల్‌నెస్‌' కోల్పోతూనే వుంది. మాజీ క్రికెటర్‌ సచిన్‌ కంటే అతని భార్య వయసులో పెద్దది. ఆ విషయం అందరికీ తెల్సిందే. సెలబ్రిటీల్లోనూ ఇలాంటోళ్ళు చాలామందే వున్నారు.

అయితే, ప్రియాంక పరిస్థితి వేరు. ప్రియాంకకీ నిక్‌ జోనాస్‌కీ వయసు తేడా పదేళ్ళకు పైనే. నిక్‌ – ప్రియాంక.. ఇద్దరూ ఓ క్లారిటీతో వున్నప్పుడు, అది ఇతరులకు ఎలా సమస్య అవుతుంది.? ఇదీ ప్రియాంక, నిక్‌ సన్నిహితులు చెబుతున్న మాట. కానీ, నిక్‌ – ప్రియాంక సెలబ్రిటీలు కదా.. తప్పదు, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.

అమెరికన్‌ మీడియా, ప్రియాంక – నిక్‌ల వివాహాన్ని 'బలవంతపు పెళ్ళి'గా అభివర్ణిస్తే, కొత్త జంట చాలా ఘాటుగా ఆ కథనాలకు కౌంటర్‌ ఇచ్చింది. అవునా.? అది నిజమేనా.? అని ఇప్పుడు ఇండియన్‌ మీడియా గుస్సా అవుతోంది.

ప్రస్తుతానికి ప్రియాంక – నిక్‌ ఇంకా పెళ్ళి వేడుకల హోరులోనే బిజీ బిజీగా వున్నారు. త్వరలో ఈ ఇద్దరూ మీడియా ముందుకు రానున్నారు. ఈలోగా నిక్‌ – ప్రియాంక సన్నిహితులకి మాత్రం, మీడియా నుంచి క్వశ్చన్స్‌ తప్పడంలేదు.

ఆల్రెడీ తమకు వ్యతిరేకంగా కథనాల్ని వండి వడ్డించిన ఇంటర్నేషనల్‌ మీడియాకి ప్రియాంక, నిక్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. అలాంటి సమాధానమే ఇండియన్‌ మీడియాకి కూడా ఈ ఇద్దరూ ఇచ్చేయబోతున్నారట.

'ఇది అసహనం కాదు.. పెళ్ళి అనేది మా వ్యక్తిగత విషయం.. మా వ్యక్తిగత జీవితాలపై అవాకులు చెవాకులు పేలే హక్కు మీడియాకి ఎవరిచ్చారు.?' అంటూ ప్రియాంక తరఫున ఇప్పటికే ఆమె సన్నిహితులు మీడియాకి గట్టి కౌంటర్‌ ఇస్తున్నారట.

తెలంగాణ వోటింగ్ ఇవాలే… ముళ్లు ఎటువైపు తిరుగనుంది?