నిఖిల్ చిత్రంలో మధుబాల

స్వామిరారా, కార్తికేయ తరువాత నిఖిల్ చేస్తున్న సినిమా సూర్య వెర్సస్ సూర్య. ఈ సినిమా మిగిలిన సంగతలు అన్నీ ఎలా వున్నా, ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, మణిరత్నం రోజా, శంకర్ జెంటిల్మన్ తో పాపులర్…

స్వామిరారా, కార్తికేయ తరువాత నిఖిల్ చేస్తున్న సినిమా సూర్య వెర్సస్ సూర్య. ఈ సినిమా మిగిలిన సంగతలు అన్నీ ఎలా వున్నా, ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, మణిరత్నం రోజా, శంకర్ జెంటిల్మన్ తో పాపులర్ అయిన అలనాటి హీరోయిన్ మధుబాల ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోందట. 

మీనా, నదియా ఇలా ఒక్కొక్కరూ మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్నారు అలనాటి హీరోయిన్లు. ఈ సినిమాకు కార్తికేయ ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఫైనాన్షియర్ శివకుమార్ నిర్మాత.