మార్చి నుంచి అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాను, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు కథ లేదు, నా దగ్గర వున్న కథకు వాళ్ల దగ్గర బడ్జెట్ లేదు అని దర్శకుడు బోయపాటి శ్రీను ‘గ్రేట్ ఆంధ్ర’ ఇంటర్వూలో చెప్పడం కాస్త సంచలనమే కలిగించింది. బుధవారం ఉదయమే బెల్లంకొండ సురేష్, అండ్ కో బోయపాటి శీను ఆపీసుకు వెళ్లారట.
ఇలా ఓపెన్ గా చెబితే జనం సినిమా లేదనుకుంటారు..చాలా ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. సినిమాకు సరిపడా బడ్జెట్ తో చేద్దామని అన్నట్లు. అలా అయితే తనకు ఫరవాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బడ్జెట్ వుంటే సినిమా చేయడానికి తనకు ఇబ్బంది లేదని, రెడీ అని బోయపాటి చెప్పినట్లు వినికిడి.
అయితే ఇంతకీ సెట్ పైకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది అన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఆపధర్మంగా ఓ ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేసారు. అవును..ఇంతకీ గెటప్, బాడీ లాంగ్వేజ్ లో ఛేంజ్ కోసం చూస్తున్నామంటూ తెలిపారు..లవర్స్ స్టోరీకి ఇంతకు ముందున్న గెటప్, బాడీ లాంగ్వేజ్ సరిపోవా..ఏమో ?