Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ సినిమాకు టైటిల్ హంట్

నిఖిల్ సినిమాకు టైటిల్ హంట్

నిఖిల్ లేటెస్ట్ సినిమా ముద్ర. ఈ సినిమా అలా అలా షూటింగ్ జరపుకుంటూ, మెల మెల్లగా విడుదల డేట్ కు వచ్చింది. మార్చిలో విడుదల. అయితే మొదటి నుంచీ ముద్ర అనే వర్కింగ్ టైటిల్ నే ఫైనల్ చేస్తే సరిపోతుందనే ఆలోచనలో వుంటూ వచ్చారు. కానీ అదే టైటిల్ ను ఎవరో చిన్న సినిమాకు రిజిస్టర్ చేసుకోవడం, వాళ్లు ఇదిగో విడుదల, అదిగో విడుదల అంటున్నారు. దీంతో విసిగిపోయిన నిఖిల్ సినిమా యూనిట్ కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తోంది.

అర్జున్ సురవరం లేదా అలా హీరో పేరు కలిసి వచ్చేలా మరికొన్ని టైటిళ్లు అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేసే ఆలోచన కూడా చేస్తారట. అంటే సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో అభిప్రాయసేకరణ చేసి అప్పుడు టైటిల్ ప్రకటిస్తారట.

మార్చిలో విడుదలయ్యే ఈ సినిమా ఇప్పటికే కాస్త ఆలస్యం అయింది. ఇకనైనా చకచకా పనులు ఫినిష్ చేసి, టైటిల్ ప్రకటించుకుంటే మంచిది. లేదూ అంటే జనాలు నిఖిల్ సినిమానా? అంటే... అవునా? ఎప్పుడు? అని ప్రశ్నించే ప్రమాదం వుంది.

ఇంతకీ నిఖిల్ ముద్ర అనే టైటిల్ కన్నా అర్జున్ సురవరం అన్న టైటిల్ కొత్త ట్రెండ్ కు తగినట్లే వుందనిపిస్తోంది.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?