Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వివిఆర్ @ 50 కోట్లు

వివిఆర్ @ 50 కోట్లు

ఒక హీరో స్టామినా ఎప్పుడు తెలుస్తుంది. సినిమా డిజాస్టర్ అయినా కొంత దూరం లాక్కు వెళ్లగలిగినపుడు. అప్పుడే టాప్ హీరో లైనప్ వుంటుంది. రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా వినయ విధేయరామ. దర్శకుడు బోయపాటిని గుడ్డిగా నమ్మి, సినిమా చేసేసాడు. ఆయన గారు. కబుర్లు ఎక్కువ, చేతలు తక్కువ అన్నట్లు, కథ తక్కువ యాక్షన్ ఎక్కువ గా సినిమా తీసి చేతిలో పెట్టారు. గ్యాంగ్ లీడర్ టైపు స్టోరీ, ఫ్యామిలీ సెంటిమెంట్ టైపు కహానీలు చెప్పి, చరణ్ ను పక్కదారి పట్టించేసాడు.

దీంతో సినిమాకు జనం రెడ్ ఫ్లాగ్ ఊపేసారు. అయినా కూడా సినిమా యాభైకోట్ల షేర్ ను ఫస్ట్ వీక్ లో వసూలుచేయడం విశేషం. 72 కోట్ల మేరకు మార్కెట్ చేసిన సినిమా తొలివారం 50 కోట్ల షేర్ రాబట్టడం అంటే ఊరటకలిగించేదే. ప్రస్తుతానికి సినిమాలు ఏవీ పెద్దగాలేవు. అందువల్ల మరి కొంచెం ముందుకు లాగితే బయ్యర్లు కొంతవరకు సేఫ్ అవుతారు. లేదూ అంటే 30శాతం లాస్ వుంటుంది.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?