Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ సినిమా వాయిదా?

నిఖిల్ సినిమా వాయిదా?

నిఖిల్ సిద్దార్థ నటించిన సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమాను మార్చి నెలాఖరున విడుదల చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అయితే అప్పుడంతా ఎన్నికలు ఏప్రియల్ 30న జరుగుతాయనే అంచనాతో వున్నారు టాలీవుడ్ జనాలు. కానీ ఇప్పడు ఏప్రియల్ 11నే పోలింగ్.

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల వ్యవహారం చాలా స్తబ్దుగా వుంది. జనాలు సినిమాల గురించి కన్నా రాజకీయాల గురించి ఎక్కువ ఆసక్తిగా వున్నారు. అందులో మార్చి నెలాఖరు నుంచి ఏప్రియల్ 11 వరకు ఎన్నికల ప్రచారం పీక్స్ లో వుంటుంది.

అందువల్ల అర్జున్ సురవరం సినిమాను ఈ టైమ్ లో విడుదల చేయాలా? వద్దా? అన్న డైలామాలో వున్నట్లు తెలుస్తోంది. మే 1కి అయితే బాగుంటుందన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఏప్రియల్ లో ఏవారం కూడా డేట్స్ ఖాళీ లేవు. అందువల్ల మే 1 స్లాట్ ను ఎంచుకునే ఆలోచనలో వున్నారు.

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?