ఒక భారీ విజయం వచ్చినపుడు హీరోలు తమని తాము సూపర్‌స్టార్లుగా పరిగణించుకుని ఇక ప్రతి సినిమాకీ అదే కొలమానంగా పెట్టేస్తుంటారు. అయితే అన్ని వేళలా అలాంటి విజయాలు రావు కనుక ఆ బబుల్ బ్రేక్ అయిన తర్వాత నేలమీద పడుతుంటారు. 'గీత గోవిందం'తో డెబ్బయ్ కోట్ల షేర్ రాబట్టిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలకి అదే బెంచ్‌మార్క్‌గా పెట్టడంలేదు.
అది అనుకోకుండా జరిగినదని, అన్నివేళలా తన సినిమాలకి అలాంటి వసూళ్లు రావనే రియాలిటీకి అతను దగ్గరగానే వున్నాడు. అందుకే 'డియర్ కామ్రేడ్' చిత్రానికి భారీ టార్గెట్ పెట్టుకోవడం లేదు. సినిమా బడ్జెట్‌కి తగ్గట్టు నిర్మాతలకి డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చేలా విక్రయాలు చేయిస్తున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ పాతిక నుంచి ముప్పయ్ కోట్ల పరిధిలోనే జరగనుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండకి వున్న క్రేజ్‌కి ఇది చాలా రీజనబుల్ రేంజ్. సినిమా బాగుందంటే బయ్యర్లు ఈజీగా రికవర్ అయిపోతారు. చాలా బాగుందంటే బాగా లాభపడతారు. తన మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే వరకు నలభై, యాభై కోట్ల బిజినెస్ చేయనివ్వరాదని విజయ్ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మిగతా హీరోలు కూడా ఇలాగే ప్రాక్టికల్‌గా వుంటే తెలుగు సినిమా 'విజయ్' దరహాసం చిందిస్తూనే వుంటుందెపుడూ.