జెర్సీ.. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సినిమా. ఈ సినిమా ఏప్రియల్ 19న విడుదలకు రెడీ అవుతోంది. సినిమా మార్కెటింగ్ దాదాపు రెండు ఏరియాలు మినహా అంతా పూర్తయింది. కృష్ణ, గుంటూరు ఏరియాలు మాత్రం నిర్మాతల దగ్గర వున్నాయి.
జెర్సీ సినిమాను హీరో నాని రెమ్యూనిరేషన్ తీసుకోకుండా, ప్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన చేయడం విశేషం. సినిమాకు అన్నీకలిపి 22 కోట్ల వరకు ఖర్చయినట్లు అంచనా. పబ్లిసిటీ మిగిలి వుంది. అయితే సినిమాను టోటల్ థియేటర్ ఇంకా నాన్ థియేటర్ హక్కులు అన్నీకలిసి నలభై కోట్లకు పైగానే విక్రయించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రను 11 నుంచి 12 కోట్ల రేషియోలో, నైజాం ఎనిమిది కోట్లకు కాస్త అటుగా, సీడెడ్ ను నాలుగు కోట్లకు పైగా మొత్తానికి ఇచ్చారు. కర్ణాటక హక్కులు రెండున్నర కోట్లకు విక్రయించారు. ఓవర్ సీస్ నుంచి నాలుగున్నర కోట్లు వచ్చింది. అంటే దాదాపు థియేటర్ రైట్స్ కిందనే ముఫైకోట్లకు పైగా వచ్చింది. ఇది కాక నాన్ థియేటర్ హక్కుల రూపంలో పన్నెండు కోట్ల వరకు వచ్చింది.
మొత్తంమీద దాదాపు నలభై రెండుకోట్ల ఆదాయం, పాతికకోట్ల లోపు ఖర్చు. వెరసి హీరో నానికి ప్రాఫిట్ షేరింగ్ కింద రెమ్యూనిరేషన్ కన్నా ఎక్కువ మొత్తమే వచ్చింది. తండ్రి కొడుకుల బంధం, క్రికెట్ నేపథ్యంలో సాగే జెర్సీ సినిమా మీద మంచి అంచనాలే వున్నాయి.