నిఖిల్ లేటెస్ట్ సినిమా ముద్ర ఇప్పటికి రెండు చిన్న షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. తమిళ దర్శకుడు సంతోష్ డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాకు హీరోయిన్ గా షాలినిపాండేను అనుకున్నారు.
కానీ ఫోటో షూట్ లో పెయిర్ అంత మ్యాచింగ్ లేదని ఫీలయినట్లు బోగట్టా. హీరోయిన్ షాట్ లు తీసే టైమ్ దగ్గరకు వస్తోంది. దీంతో ఏం చేయాలని యూనిట్ మల్ల గుల్లాలు పడుతోందని తెలుస్తోంది.
అర్జున్ రెడ్డిలో ఆ క్యారెక్టర్ కు తగినట్లు కనిపిస్తుంది షాలిని పాండే. అక్కడ పాత్రే కీలకం పెయిర్ కాదు. కానీ ముద్ర సినిమాకు వచ్చేసరికి పెయిర్ మ్యాచ్, పాటలు ఇతరత్రా వ్యవహారాలు వున్నాయి.
అందుకే ఇప్పుడు మరో హీరోయిన్ ఎవరు సూట్ అవుతారా అని వెదుకుతున్నట్లు బోగట్టా. రెజీనా, లావణ్య త్రిపాఠీ ఇద్దరూ ఇప్పటి దాకా నిఖిల్ సరసన చేయలేదు. అలాగే మేఘా ఆకాష్ కూడా. రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా, అది మేఘా ఆకాష్ కు సంబందించినది కాదు. సినిమాల ఫెయిల్యూర్. మేఘా ఓకె అనే పేరు వచ్చింది.
కానీ మేఘా అయితే నిఖిల్ సరసన క్యూట్ గా వుంటుందని భావిస్తున్నారట. రెజీనా, లావణ్య ఆల్రెడీ సీనియర్లు అయిపోయారు. అల్లు శిరీష్ తో కూడా వేసేసారు. అందువల్ల మేఘా అయితే పెర్ ఫెక్ట్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.