భరత్ అనే నేను విడుదలయి రెండువారాలయింది. సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. అందులో వన్ పర్సంట్ డౌట్ లేదు. కానీ నా పేరు సూర్య విడుదల కాస్త భారీగానే చేసారు. మల్టిపుల్ సెంటర్లలో థియేటర్లు కుమ్మేసారు. దానికి తోడు షేర్ పడిపోతుందిన భరత్ అనే నేను సినిమాను ఒక్కో థియేటర్ వుంచి మిగిలినవి వదిలేసారు.
కానీ సూర్య విడుదల రోజు ఇలా మల్టిపుల్ సెంటర్లలో మిగిలిన ఒక్కోథియటర్ హవుస్ ఫుల్ అయ్యాయి. ఇది కేవలం ఒక్క ఆట కూడా మూడు నాలుగు ఆటలు. దాంతో మళ్లీ థియేటర్లు జోడించారు. మల్టిఫుల్ థియేటర్లు వున్న సెంటర్లలో చాలా చోట్ల మళ్లీ ఒక్కో థియేటర్ యాడ్ చేసారు. అయినా కూడా రెండింటిలో ఒక థియేటర్ సండే నాడు ఫుల్ కావడం విశేషం.
సమ్మర్ హాలీడేస్ కావడం, బయట ఎండలు మండిపోతుండడం, ఇప్పుడు థియేటర్లు అన్నీ ఏసి కావడంతో, మాట్నీ, ఫస్ట్ షోలు బాగా ఫుల్స్ అయిపోతున్నాయిు. సో, బ్యాన్ ఈజ్ బ్యాక్ అన్నమాట. సూర్య సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అది కూడా బ్యాన్ కు కాస్త ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు సూర్యకు దొరకని విజువల్ మీడియా సపోర్ట్ బ్యాన్ కు కాస్త బలంగానే దొరికినట్లు కనిపిస్తోంది.