Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మలా కాన్వెంట్ నిర్మాత ఎవరు?

నిర్మలా కాన్వెంట్ నిర్మాత ఎవరు?

ఎవరో బిడ్డను ఎవరో పెంచి పెద్ద చేస్తున్నట్లుంది నిర్మల కాన్వెంట్ సినిమా వ్యవహారం. జనాల ముందు ఈ సినిమా సీన్ ఏమిటంటే..అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం. నాగ్ సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ తొలిసారి నిర్మాణ భాగస్వామ్యం. ఇద్దరు మాంచి ఫ్రెండ్స్ కాబట్టి, నాగ్ సినిమాలో కీలక పాత్రలో ద్వితీయార్థం అంతా కనిపిస్తాడని టాక్. అందుకే నాగ్ తెగ ప్రచారం చేసి, సినిమా ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటున్నారంతా. 

ఇప్పుడు ఈ సినిమాను అవుట్ రేట్ గా అమ్మేసారు. అంటే వరల్డ్ రైట్స్ అన్నీ పొంది వేరే వాళ్లు సినిమాకు హక్కు దారులు అయ్యారు. ఇదిలా వుంటే, సినిమాకు అసలు నిర్మాత వేరే వున్నారని తెలుస్తోంది. నాగ్, నిమ్మగడ్డ కేవలం పాత్రధారులు మాత్రమేనట. సినిమాకు హైప్ తీసుకురావడానికి, మంచి ఓపెనింగ్స్ తీసుకురావడానికి ఈ ఆలోచన చేసారని వినికిడి. 

ఈ సినిమాకు దర్శకుడు అయిన నాగ కోటీశ్వరరావు కుమారుడు జికె ఈ సినిమాకు అసలు నిర్మాత అని తెలుస్తోంది. కొడుకు కోసం హీరో శ్రీకాంత్ కొంత పెట్టుబడులు పెట్టారని వినికిడి. ఈ జికె అటు మెగాస్టార్ చిరంజీవికి, ఇటు నాగార్జున కు అత్యంత సన్నిహితుడు. అందుకే జికె కోసం, ఆయన తండ్రి తొలి డైరక్షన్ సినిమా కోసం, నాగార్జున, ఆయన మిత్రుడు నిమ్మగడ్డ రంగంలోకి దిగారన్నమాట. 

ఇలా అటు శ్రీకాంత్, ఇటు జికె పెట్టుబడులు పెట్టి, నాగార్జున, నిమ్మగడ్డల పేర్లు తెర ముందు పెట్టి, ఇప్పుడు అవుట్ రేట్ గా భారీ మొత్తానికి విక్రయించిన సినిమా నిర్మలా కాన్వెంట్. జనాలంతా మాత్రం నాగ్ నే స్వయంగా శ్రీకాంత్ కొడుకు ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారని అనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అంతే. తెర ముందు కనిపించేది వేరు..తెరవెనుక వ్యవహారాలు వేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?