Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'నిన్నే పెళ్లాడతా..' అలా వెంటాడుతోంది!

'నిన్నే పెళ్లాడతా..' అలా వెంటాడుతోంది!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “నిన్నే పెళ్లాడతా’’ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పటి కి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా నిలిచి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. నాగ్ కెరీర్ లో ఒక సూపర్ హిట్ గానే కాకుండా, దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ లో కూడా ఇదో మరపురాని సినిమాగా, అతడి ప్రత్యేకతను చాటిన సినిమాగా నిలిచింది.

అంతేనా… ఈ రెండు దశాబ్దాల్లో ఏదో విధంగా ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది. సందీప్ చౌత సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఎక్కడో ఒక చోట మోగుతూనే ఉంటాయి. కేవలం ట్యూన్లే కాదు.. ఈ సినిమా లిరిక్స్ కూడా బాగా పాపులర్! ఎంత పాపులర్ అంటే.. వాటిని ఆధారంగా చేసుకుని, వాటినే టైటిల్స్ గా చేసుకుని సినిమాలే వచ్చాయి. టబు, నాగార్జునల మీద చిత్రీకరించిన “గ్రీకు వీరుడు..’’ అనే సాంగ్ మాస్ లో కూడా బాగా పాపులర్. ఈ పాటతో తెలుగులో యమ పాపులర్ అయిన “గ్రీకు వీరుడు..’’ పదంతో ఇప్పటి వరకూ రెండు సినిమాలు వచ్చాయి.

“నిన్నే పెళ్లాడతా’’ విడుదల అయిన కొన్ని రోజుల్లోనే “గ్రీకు వీరుడు’ పేరుతో ఒక సినిమా ఆ తర్వాత కొన్నేళ్ల కిందట నాగార్జున హీరోగా అదే టైటిల్ తో మరో సినిమా వచ్చాయి. ఇక  సినిమాలోని మరో ఫేమస్ సాంగ్ “ఎటో వెళ్లిపోయింది మనసు..’’ బాలూ పాడిన ఈ విరహ గీతం పేరుతో కూడా ఒక సినిమా వచ్చింది. ఈ పొయెటిక్ ఎక్స్ ప్రెషన్ ను అలా వాడుకున్నారు. ఇక “కన్నుల్లో నీ రూపమే..’’ అనేది నిన్నే పెళ్లాడతా సినిమాలో ఒక సూపర్ హిట్ పాట, ఇప్పుడు ఈ టైటిల్ తో ఒక సినిమా వస్తోంది. 

ఇవన్నీ ఇలా ఉంటే.. “నిన్నే పెళ్లాడతా’’ టైటిల్ తోనే ఒక సినిమా వస్తోందట. చైతూ హీరోగా నటించబోతున్న ఒక సినిమాను ఈ పేరుతో రూపొందించనున్నారని సమాచారం. తండ్రి కెరీర్ లో సూపర్ హిట్ గా కల్ట్ హిట్ గా నిలిచిపోయిన సినిమా టైటిల్ ను చైతూ ఇలా వాడుకొంటున్నాడట. మరి ఇదే జరిగితే మొత్తంగా “నిన్నే పెళ్లాడతా’’ టైటిల్ తో మూడో సినిమా అవుతందది. నాగార్జున కన్నా మునుపు బ్లాక్ అండ్ వైట్ యుగంలో ఎన్టీఆర్ హీరోగా “నిన్నేపెళ్లాడతా’’ అనే సినిమా వచ్చింది. మొత్తానికి ఈ టైటిల్ లోనే మ్యాజిక్ ఉన్నట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?