హీరోలు సిన్మా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకోవడం లేదా, భాగస్వాములు కావడం కొత్త కాదు. టాప్ హీరోలు అందరూ ఇదే పని చేస్తున్నారు. మరో హీరో కూడా స్వంత బ్యానర్ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. ఎన్నాళ్ల నుంచో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిషన్ స్వంత బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్ల బిజినెస్ రంగంలో సందీప్ కిషన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.
తనకు మంచి సినిమాగా నిలిచిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు గుర్తుగా వెంకటాద్రి టాకీస్ అనే బ్యానర్ ను సందీప్ కిషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యానర్ మీద తొలిసారి సూపర్ నాచురల్ పవర్స్ నేఫథ్యంలో కథ తీసుకుని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. కార్తీక్ రాజు అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తారు.
ఈ సినిమా టైటిల్, ప్రొడక్షన్ లోగో రేపు లాంచ్ చేస్తారు. సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ నటిస్తుంది. పోసాని, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు నటిస్తారు. థమన్ సంగీతం అందిస్తారు.
ఈ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ బ్యాకింగ్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర అందిస్తారని తెలుస్తోంది. ఈ స్వంత సినిమాతో ఎలాగైనా కెరీర్ ను టర్న్ తీసుకునేలా చేయాలని, అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సందీప్ కిషన్.
అతగాడు తమన్నాతో కలిసి నటించిన నెక్ట్స్ ఏంటీ సినిమా వచ్చేనెలలో ఫ్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా మీద కూడా సందీప్ కు మంచి ఆశలు వున్నాయి.
కులం చెడ్డా సుఖం దక్కుతోందా! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్